- ఇప్పటివరకు ఒక్క రైతుకు కూడా రైతు భరోసా నిధులు ఖాతాలో జమ కాలేదు
- ఎస్సీ, ఎస్టీ చేవెళ్ల డిక్లరేషన్ ను వెంటనే అమలు చేయండి
- గిరిజన తండాలకు స్పెషల్ బడ్జెట్ కేటాయించి అభివృద్ధికి తోడ్పడండి
- సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి రోజు ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించండి
- షాద్ నగర్ సిపిఎం నాయకులు ఈశ్వర్ నాయక్
(పయనించే సూర్యుడు ఫిబ్రవరి 01షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జి మేఘవత్ నరేందర్ నాయక్): ప్రజా పాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటినప్పటికీ ఇక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్క హామీలను అమలు చేయకుండా కేవలం మాయ మాటలు చెబుతూ దాటవేస్తున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వమని సిపిఎం నాయకులు ఈశ్వర్ నాయక్ అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేకమైన హామీలు ప్రజలకు ఇచ్చిందని అని ఆ హామీలు ఒక్కటి నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ ఉందని వారు అన్నారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలని అదే రకంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ చేవెళ్ల డిక్లరేషన్ను వెంటనే అమలు చేయాలని గిరిజన తాండాలను గూడేలను రెవెన్యూ గ్రామపంచాయతీలో గుర్తించి స్పెషల్ బడ్జెట్ కేటాయించి అభివృద్ధి చేయాలని వారు డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు భరోసా పథకాన్ని వెంటనే అమలు చేయాలని అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా పథకం వర్తింపజేయాలని వారు అన్నారు అదే రకంగా గిరిజనుల ఆరాధ్య దైవం సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15 జరుగుతుంది కాబట్టి ఆ రోజు ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు