Friday, January 31, 2025
Homeఆంధ్రప్రదేశ్ప్రాథమిక విద్య కోసం ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడాలి?

ప్రాథమిక విద్య కోసం ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడాలి?

Listen to this article

పయనించే సూర్యుడు: జనవరి 30: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి. రామ్మూర్తి.ఎ.

వాజేడు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య విద్యార్థుల గూర్చి పలు విధాల నిర్ణయాలు తీసుకుంటూ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంటే వాజేడు మండలంలోని ఘణపురం కాలనీ గ్రామంలో ప్రాథమిక విద్యార్థుల భవిష్యత్తు అఘమ్య గోచరంగా కనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే వాజేడు మండలం మురుమూరు పంచాయతీ గణపురం కాలనీ గ్రామంలో ప్రాథమిక విద్య అనగా కనీస అక్షరాలు నేర్చుకునే భాగ్యం కరువైందని అంగనవాడి పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కారణం గతంలో అంగన్వాడి కేంద్రం శాంక్షన్ అయినప్పటికీ ఇప్పటివరకు నియమించకపోవడం గమనార్హం. గత టిఆర్ఎస్ ప్రభుత్వం లో అంగన్వాడి శాంక్షన్ అయినప్పటికీ కొన్ని రాజకీయ శక్తులు అంగన్వాడి కేంద్రo లో తన సొంతవాళ్లు అంగన్వాడీ టీచర్లుగా అంగన్వాడీ ఆయాలుగా నియమించాలని పట్టుబట్టి చివరికి అంగన్వాడీ లేకుంటా చేశారు. కానీ గ్రామంలో ఉన్నటువంటి పిల్లలకి అక్షరాలు నేర్చుకునే యోగ్యత లేకుండా చేసిన నీచమైన రాజకీయ నాయకులకు ఏ విధమైన సంతృప్తి మిగిలిందో తెలియడం లేదు. అంగన్వాడి కేంద్రం నిర్మించాలని అంగన్వాడికి ఉపాధ్యాయురాలు నియమించాలని పలుమార్లు పత్రిక ప్రముఖంగా విన్నవించుకున్న అధికారులుకూడా పట్టించుకోవటం లేదని పిల్లల తల్లిదండ్రులు తెలియజేశారు. గణపురం కాలనీ గ్రామంలో గర్భిణీలు: 2 బాలింతలు 5 ఏడు నెలల నుండి01 సంవత్సరం వరకు ఉన్న పిల్లలు పదిమంది ఉండగా మరియు ఫ్రీ స్కూల్ విద్యార్థులు మూడు సంవత్సరముల నుండి 05 సంవత్సరముల వరకు ఉన్న విద్యార్థులు 13 మంది ఉండగా కనీసం అక్షరాలు నేర్పే అంగనవాడి టీచర్లు కరువయ్యారని పిల్లల తల్లిదండ్రులు వాపోయారు. గణపురం కాలనీ అంగన్వాడి ఇన్చార్జి టీచర్లని ప్రశ్నించగా మమ్మల్ని కేవలం ఇంచార్జి టీచర్ల గానే నియమించారని మా యొక్క అంగన్వాడీ కేంద్రంలో మా పిల్లలకు విద్య బుద్ధులు నేర్పుకుంటామని ఇక్కడికి రావాలంటే కష్టమని తెలియజేశారు. కేవలం పిల్లలకి రావలసినటువంటి బియ్యం పప్పులు గుడ్లు, బాలామృతం లాంటివి అందజేయడం కోసం మాత్రమే మేము వస్తాము అని తెలియజేశారు. ప్రభుత్వం ప్రజలకు అందించే ప్రాముఖ్యమైనది విద్య, వైద్యం అటువంటి విద్యని దూరం చేసిన నాయకులపై చర్యలు తీసుకుంటూ గణపురం కాలనీ గ్రామంలో అంగన్వాడి కేంద్రం నిర్మించాలని గ్రామంలోని చిన్నపిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.ఇకనైనా ములుగు జిల్లా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చొరవ చూపించి గణపురం కాలనీలో అంగన్వాడి కేంద్రం నియమించి పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments