
పయనించే సూర్యుడు, ఫిబ్రవరి 3, జగ్గయ్యపేట ప్రతినిధి భూక్యా కవిత :
జగ్గయ్యపేట పట్టణంలో ఆర్టీసీ డిపో గ్రౌండ్ లో జగ్గయ్యపేట క్రికెట్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జగ్గయ్యపేట ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంటును స్థానిక నేతలతో కలిసి శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు, దొంతు చిన్న,శ్రీరాం చిన్నబాబు,మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య మాట్లాడుతూ క్రీడల వల్ల స్నేహ సంబంధాలు పెరుగుతాయని తెలిపారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓడిపోయిన వారు నిరుత్సాహపడకుండా మళ్లీ గెలిచేందుకు కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మైనేని రాధాకృష్ణ, కౌన్సిలర్స్ సంగెపు బుజ్జిబాబు, గొట్టే నాగరాజు, గింజుపల్లి వెంకట్రావు, పేరం సైదేశ్వర రావు,ఇర్రి నరసింహారావు మరియు నాయకులు తాళ్లూరి వెంకటేశ్వరరావు, కారుపాటి డేవిడ్, యామర్తి బోస్ యాదవ్, గింజుపల్లి కృష్ణ,దువ్వల రామకృష్ణ, పూసల పుల్లారావు, కోటగిరి సుధాకర్, డోగుపర్తి నాగబూషణం,తాటి రామారావు, ఎనికే గోపి, గుమ్మా వెంకటేష్,హరి, షబ్బు మరియు క్రికెట్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు