Friday, January 31, 2025
Homeతెలంగాణబండి సంజయ్ ని భర్త రఫ్ చేయాలి

బండి సంజయ్ ని భర్త రఫ్ చేయాలి

Listen to this article

ఎంపీ పదవీ నుండి బర్తరఫ్ చేయాలని పాలకుర్తిలో ప్రజా సంఘాల, గద్దర్ అభిమానుల ఆందోళన

పయనించే సూర్యుడు జనవరి 29 (జనగాం ప్రతినిధి కమ్మగాని నాగన్న )తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మ గౌరవాన్ని ప్రపంచ చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలబెట్టిన మహోన్నత వ్యక్తి గద్దరని అట్లాంటి వ్యక్తిని అత్యంత అవమానకరంగా వ్యాఖ్యానించిన బిజెపి ఎంపీ బండి సంజయ్ ని తక్షణమే ఎంపీ పదవి నుండి బర్తరఫ్ చేసి భాజపా పార్టీ నుండి బహిష్కరణ చేయాలని గద్దర్ అభిమానులు, ప్రజాసంఘాల నాయకులు పాలకుర్తిలో నిరసన తెలుపుతూ డిమాండ్ చేశారు.
బుధవారం స్థానిక రాజీవ్ చౌరస్తాలో గద్దర్ అభిమానులు, వివిధ ప్రజా సంఘాలు, విప్లవ పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి రాష్ట్ర కమిటీ సభ్యులు గుమ్మడి రాజుల సాంబయ్య. సీనియర్ కాంగ్రెస్ నాయకులు భూమా రంగయ్య .చిలువేరు కృష్ణమూర్తి .సంగి వెంకన్న .దేవరాయ సాయిలు.తెలంగాణ ఉద్యమకారుడు పనికిరా మోహన్ రాజ్. నలమాస రమేష్ లు మాట్లాడుతూ బండి సంజయ్ గుట్కాలు, మట్కాలు దొంగతనంగా అమ్మి జైలు జీవితం గడిపి తొండి మొండి మాటలతో బిజెపి అవకాశవాద రాజకీయాలతో కరీంనగర్ పార్లమెంటు నుండి గెలిచిన బండి సంజయ్ తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక, శ్రమ సంస్కృతికి, శ్రమైక జీవన సౌందర్యం సమాజాన్ని శాసించాలని నమ్మిన మహోన్నత భావాజాలం వంట పట్టించుకున్న తెలంగాణ మట్టి మాగానం ప్రజా యుద్ధనౌక గద్దర్ పట్ల అహంకార ధోరణితో, అవహేళనతో, అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ వ్యాఖ్యలు నిరసనగా అతనిని వెంటనే ఎంపీ పదవి నుండి భర్తగారఫ్ చేసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పేదాకా గద్దర్ అభిమానులు పోరాడుతూనే ఉంటారని వారన్నారు గద్దర్ అంటే ప్రపంచ చరిత్ర పుటల్లో తెలంగాణ చరిత్రను అతి తక్కువ మాటలతో అన్ని రకాల, అన్ని భాషల వ్యక్తులకు అర్థమయ్యే విధంగా భావుకతను వ్యక్తం చేసిన గొప్ప భావకవి అని వారన్నారు.
వెన్నుల్లో తూటాలు నింపిన మొక్కవో నీ దీక్షతో 80 ఏళ్లు పైబడిన ఎప్పుడూ ప్రజల పక్షాన్నే పాట పాడిన, మాట మాట్లాడిన అణగారిన వర్గాల హక్కుల గుంతైన తెలంగాణ యుగపురుషుడు గద్దరని వారు కొనియాడారు అలాంటి గద్దర్ను ఒక అవగాహన లేని, చదువురాని దద్దన్న, మూర్ఖపు రాజకీయ నాయకుడు, సంచలనాల కోసమే వార్తా ప్రకటనలు చేసే బండి సంజయ్ తక్షణమే యావత్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో బండి సంజయ్ మీద కేసులు నమోదు చేస్తామని వారన్నారు తక్షణమే బండి సంజయ్ గద్దర్ కుటుంబానికి యావత్ తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలన్నారు
నిజంగానే గద్దర్ హంతకుడు అయితే భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గద్దర్ కుటుంబానికి సంతాపలేఖను ఎలా పంపాడు అని వారు ప్రశ్నించారు కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడడం సంజయ్ తెలివి తక్కువ తనానికి నిదర్శనం అన్నారు గద్దర్ ఏనాడు అవార్డుల కోసం పనిచేయలేదనే సంగతి తెలంగాణలో పసి పిల్లవాడిని అడుగున చెబుతారన్న సంగతి ఎరగని ఒక మూర్ఖపు అనామకుడు బండి సంజయ్ అని వారు దుయ్యబట్టారు అవార్డులు ఏమైనా భాజాపా సొంత ఆస్తి? జాగీరా ?భాజపా ప్రభుత్వం రాజ్యాంగం పరిధిలో పని చేయదా? రాజ్యాంగాన్ని అతిక్రమించి పనిచేసిన ఏ పాలకుడు చరిత్రలో నిలువ లేదన్న సత్యాన్ని ఇప్పటికైనా గుర్తించాలని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల సంఘం జిల్లా చైర్మన్ నారగోని ఎల్లయ్య. కొనకటి కళింగరాజు. జోగు పరశురాములు. గోగుల దేవరాయవెంకన్న.సంపత్ .బండిపెల్లి వెంకన్న. గోనె మహేందర్ రెడ్డి.దౌపాటి రవి.గొనె కిరణ్. విరమల్ల వెంకన్న.విరమనేని నర్సింహారావు.సుధాకర్.తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments