
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 4,బచ్చన్నపేట మండల ప్రతినిధి. జనగామ జిల్లా.
బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని బచ్చన్నపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి అన్నారు. పత్రిక విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణపై కేంద్రం విద్వేషం చూపుతుంది అని వారన్నారు. సీనియర్ నాయకులు జింగిటి విద్యానాథ్ మాట్లాడుతూ పీఎం మోడీ బడ్జెట్లో తెలంగాణను చిన్నచూపు చూడడమే కాకుండా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను నిరశపరిచారని అన్నారు. కేంద్ర మంత్రులు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటించి వారి మంత్రి పదవులకు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఢిల్లీ, బీహార్ ఎలక్షన్ల కోసమే బడ్జెట్ ప్రవేశపెట్టినట్టుగా ఉందని తెలంగాణ సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై కేంద్రం చూపిస్తున్న వివక్షకు బడ్జెట్ కేటాయింపులే నిదర్శనమని వారు అన్నారు. కొన్ని రాష్ట్రాలకే బడ్జెట్ కేటాయింపులు అందిస్తే వికసిత భారత్ ఎలా సాధ్యమని వారు ప్రశ్నించారు. కార్యక్రమంలో బచ్చన్నపేట పట్టణ అధ్యక్షుడు మహాత్మ చారి, సిద్దేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ ఆముదాల మల్లారెడ్డి, మాస పేట రవీందర్ రెడ్డి, రాజిరెడ్డి దాచేపల్లి రాజయ్య, నీల రమేష్, సురేందర్ రెడ్డి, గంగం బుచ్చిరెడ్డి, అఖిల్ మాల తదితరులు పాల్గొన్నారు