
పయనించే సూర్యుడు//న్యూస్ //ఫిబ్రవరి 14 : మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో గతంలో సుభాని అనే వ్యక్తి కొంత మంది దగ్గర నుండి ఎక్కువ వడ్డీని ఆశ చూపించి, వారితో దాదాపుగా 150కోట్ల రూపాయలని తీసుకొని, ఎగ్గొట్టి మోసం చేశాడు. వారిని కర్నూల్ లో మొన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మక్తల్ నియోజక వర్గానికి చెందిన బాధితులు నేడు పోలీస్ స్టేషన్ లో ఆందోళన చేయగా, బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చిన స్థానిక శాసనసభ్యులు డా. వాకిటి శ్రీహరి . ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వంతో మాట్లాడి, సుబాని దగ్గర నుండి అందరు బాధితులకు డబ్బులు అందేలా చూస్తామన్నారు.