
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 4 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం 05/02/2025 బుధవారం రాష్ట్ర బిసి సంక్షేమ & చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ గోరంట్ల మండలంలో పర్యటిస్తున్నారు వాటి వివరాలుపెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం మందలపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న మేరెడ్డిపల్లికి పోవు రోడ్డు 1ఒక కోటి 14లక్షల రూపాయల నిధులు వెచ్చించి వేయించిన బీటి రోడ్డు ఉదయం 10గంటలకు ప్రారంభించడం జరుగుతుంది, అనంతరం మేరెడ్డిపల్లి గ్రామం నందు గల అతిపురాతన ప్రసిద్ధిగావించిన శ్రీ వేణుగోపాల్ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. కావున గోరంట్ల మండల టీడీపీ & ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొనవలసినదిగా కోరుచున్నాము ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు ఉదయం 9.30గంటలకు గోరంట్ల మండల కేంద్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్దకు చేరుకోవాలని మనవి
ఈ కార్యక్రమంలో ప్రింట్& ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కవర్ చేయవలసిందిగా తెలియజేస్తున్నాంఅని
టీడీపీ మండల కన్వీనర్ బి సోమశేఖర్ ఓ ప్రకటన లో తెలిపారు