Thursday, January 16, 2025
Homeఆంధ్రప్రదేశ్బ్లడ్ డోనర్స్ కి ఇన్సూరెన్స్ సదుపాయం

బ్లడ్ డోనర్స్ కి ఇన్సూరెన్స్ సదుపాయం

Listen to this article

పాయనించే సూర్యుడు బాపట్ల జనవరి 15:- రిపోర్టర్ (కే శివకృష్ణ)… రెడ్ క్రాస్ సొసైటీ నిర్వహణలో రేపల్లె ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో గత 16 సంవత్సరముల నుండి రేపల్లె ప్రాంత ప్రజలకు రక్తం సరఫరా ప్రభుత్వ అవసరాలను తీరుస్తూ , అత్యున్నత ప్రమాణాలతో , ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా బ్లడ్ బ్యాంక్ నిర్వహించబడుతున్నది. ఇందులో హోల్ బ్లడ్ లైసెన్స్ ఉన్నది. అలాగే బ్లడ్ కాంపోనెంట్స్ స్టోరేజ్ పాయింట్ పర్మిషన్ ఉంది. రేపల్లె, బాపట్ల పరిధిలో అనేక వేలమంది రక్తదాతలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదాతల సేవలను గుర్తించి గౌరవ మంత్రివర్యులు శ్రీ అనగానే సత్యప్రసాద్ గారి ఆదేశానుసారం ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి బ్లడ్ డోనర్స్ కి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ సదుపాయం ఒక్కొక్కరికి కలుగజేయబడుతుంది. అదేవిధంగా ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి బ్లడ్ కాంపోనెంట్స్ అయినా ఆర్ బి సి ప్యాకెడ్ cells అన్ని గ్రూపులువి అందుబాటులో ఉంచబడును. ఇందుకోసం ఏపీ స్టేట్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్, విజయవాడ వారిచే ఒప్పందం కుదిరినది. రక్త దాతలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా కోరుచున్నాము.
డాక్టర్ వసంతం వీరరాఘవయ్య చైర్మన్ , ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, రేపల్లె

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments