
పయనించే సూర్యుడు జనవరి 18 మంచిర్యాల్ జిల్లా మంచిర్యాల్ మండల్ రిపోర్టర్ (గొడుగు ఆశీర్ విల్సన్)… మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి నదిలో స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నేతృత్వంలో ఇసుక మట్టిని తోడి అక్రమంగా వందలాది లారీలలో ఇసుక మట్టిని తరలించి డబ్బులు దండుకుంటున్నారు అని అన్నారు, మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఈ వైనాన్ని అధికార యంత్రాంగం మాత్రం చూసి,చూడనట్టుగా ఉంటున్నారని అధికారులపై మండి పడ్డారు,ఇలా గోదావరిలో ఇసుక,మట్టి తీయడం వలన వర్షాకాలంలో గోదావరిలో నీరు వచ్చిన తర్వాత ప్రజలకు ఈ అక్రమ తవ్వకాల వల్ల ప్రాణాపాయం పొంచి ఉందని అన్నారు, మంచిర్యాల గోదావరిలో జరుగుతున్న అక్రమ తవ్వకాలపై అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.మంచిర్యాలలో జరుగుతున్న అక్రమ తవ్వకాలను ఉన్నత అధికారులకు తెలియజేయనున్నారు
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు,బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ పాల్గొనడం జరిగింది..