
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 10 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి మహాకుంభమేళాకు భక్తుల రద్దీ అంతకంతకూ పెరుగు తూనే ఉంది. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగా రాజ్‌కు రోజురోజుకు భక్తులు పోటెత్తుతున్నారు. కుంభామేళా మొదలై ఇరవై ఎనిమిది రోజులు అవుతున్నా ఇప్పటికీ రద్దీ తగ్గడం లేదు. ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుండి ఈరోజు మధ్యాహ్న వరకు 1.42 కోట్లకు పైగా భక్తులు గంగా, సంగమంలో స్నానమాచరిం చారు.ఇప్పటివరకు నలబై రెండు కోట్లకు పైగా భక్తులు కుంభమేళాకు చేరుకున్నారు. కోట్లాది మంది భక్తులు ప్రయాగ్ రాజ్‌కు తరలివస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే రోడ్డు మార్గాలన్నీ వాహ నాలతో నిండిపోయాయి.ముఖ్యంగా ప్రయాగ్‌రాజ్ వైపు సుమారు రెండు వందల కిలోమీటర్ల నుంచి మూడు వందల కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ అయింది. ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే మార్గా ల్లో భారీ రద్దీ కారణంగా, అనేక మంది భక్తులు పదకొండు గంటలకు పైగా ట్రాఫిక్ జామ్‌లలో చిక్కుకున్నారు.మధ్యప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. కట్ని, మైహార్, రేవా అంతటా రోడ్లు మూసుకుపోయాయి. వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను నియంత్రించడానికి పోలీసులు ప్రయాగ్‌రాజ్ అధికారులతో కలిసి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.ఈ ట్రాఫిక్ రద్దీని నియంత్రిం చేందుకు మధ్యప్రదేశ్‌లోనే వేలాది వాహనాలను పోలీసులు నిలిపివేస్తు న్నారు. అయినప్పటికీ వాహనాల రద్దీ ఆగడం లేదు. ఎక్కడ చూసినా వాహనాలే.. రోడ్లన్నీ వాహ నాలతోనే నిండిపోయాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్‌గా చెప్పవచ్చు