
రుద్రూర్, ఫిబ్రవరి 04 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
శ్రీ జస్టిస్ షమిమ్ అక్తర్, ఏకసభ్య ఎస్సి సబ్ క్లాసిఫికేషన్, తెలంగాణ రాష్ట్రం ఎస్సి వర్గీకరణ పై అభిప్రాయం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియచేయుట మాల వర్గాలు ఎక్కడ వర్గీకరణను అడ్డు కొంటారోనని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వర్ని, రుద్రూర్, మోస్రా, చందూర్ మండల పలు గ్రామాల అంబేద్కర్ యువజన, మాల ఉద్యోగం సంఘాల నాయకులను, మాల మహానాడు నాయకులను మంగళవారం ఉదయం పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ప్రభుత్వాలకు మాల సంఘాల ప్రజలు బుద్ది చెప్పాలని రుద్రూర్ మాల మహానాడు మండల అధ్యక్షుడు దాసరి శ్యామ్ పేర్కొన్నారు. ఈ అక్రమ అరెస్ట్ ను ఆయన తీవ్రంగా ఖండించారు. అరెస్ట్ చేసిన వారిలో నవీన్, కిషోర్, గౌతమ్ తదితరులు ఉన్నారు.