
పయనించే సూర్యుడు, ఫిబ్రవరి 3, అశ్వాపురం ప్రతినిధి,
యస్.సి.వర్గీకరణ, అనుకూల కీలక ప్రకటన చేసిన,ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తామని ప్రకటించినందున అశ్వాపురం మండలంలోని మల్లెలమడుగు గ్రామంలో మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేసిన మాదిగ జే.ఏ.సి జిల్లా సెక్రటరీ దేపంగి వెంకటరమణ మరియు నాయకులు.ఈ సందర్బంగా దేపంగి వెంకటరమణ మాట్లాడుతూ యస్.సి.వర్గీకరణ ఈ 2024 కులగనణ ఆధారం గా,మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించాలని ముఖ్యమంత్రిని,తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మంత్రి వర్గాన్ని కోరినారు.మాదిగ జే.ఏ.సి.వ్యవస్థాపకులు డా.పిడమర్తి రవి గారి పిలుపు మేరకు ముఖ్యమంత్రికి పాలాభిషేకం చేసినామని తెలిపినారు.
ఈ కార్యక్రమంలో మాదిగ జే.ఏ.సి. గద్దల నర్సయ్య.నండ్ర వెంకటి.ఇస్సంపల్లి వెంకటి.కోప్పుల నరసింహారావు.రావులపల్లి నాగేశ్వరరావు .గొడ్ల రవేషు.బాబు.తదితరులు పాల్గొన్నారు.