పయనించే సూర్యుడు న్యూస్ 1 ఫిబ్రవరి సిరిసిల్ల టౌన్ రిపోర్టర్ బాలకృష్ణ: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కళ్యాణ లక్ష్మి గార్డెన్స్ లో శనివారం నిర్వహించిన రాజన్న సిరిసిల్ల జిల్లా ముదిరాజ్ సంఘ జిల్లా, కార్యవర్గం ప్రమాణ స్వీకారానికి రుద్రంగి మండల ముదిరాజ్ సంఘ సభ్యులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. వారు మాట్లాడుతూ నేడు జిల్లా కేంద్రంలోని ఇటీవల నూతనంగా ఎన్నికైన ముదిరాజ్ జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి పెద్ద ఎత్తున తరలివెళ్లడం జరిగిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కవ సంఖ్యలో ఉన్న ముదిరాజ్ లు రాజకీయంగా ఆర్దికంగా ఎదగాలని అన్నారు. ముదిరాజ్ కులస్తుల చిరకాల కోరిక అయిన బీసీ డి నుండి బీసీ ఏ లోకి మార్చే ప్రక్రియను ప్రభుత్వం ముందడుగు వేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో రుద్రంగి మండల అధ్యక్షులు దాసరి అశోక్,నాయకులు గండి నారాయణ,పోగుల దేవయ్య, గండి అశోక్,పాల నర్సయ్య, జెంగిలి శ్రీకాంత్, రాగుల నరేష్, రణవేణీ సందీప్, పోగుల రాజం, తునికి నర్సయ్య, దండవేణి నర్సయ్య, దూలూరు భూమయ్య, తునికి రమేష్, నచారి రాకేష్, పండుగు గంగాధర్, బోన్ల సత్యం, కోమిరే గంగానర్సయ్య, తదితరులు పాల్గొన్నారు