
పయనించే సూర్యుడు న్యూస్ మక్తల్ జనవరి 19 నారాయణపేట జిల్లా కృష్ణ మండలం గుడెబల్లూర్ సమీపంలోని జాతీయ రహదారి 167 పై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. మక్తల్ నుండి వస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని ఢీ కొట్టినట్లు పోలీసులు తెలిపారు. వీరిని రాయచూర్ రిమ్స్ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై నవీద్ తెలిపారు. వీరు స్థానిక ఇటుకబట్టిలో పనిచేస్తున్నట్లు సమాచారం.