
సిపిఎం, tags నాయకులు
పయనించేసూర్యుడు ఫిబ్రవరి 25 టేకులపల్లి రిపోర్టర్ (పొనకంటి ఉపేందర్ రావు) ఇల్లందు పరిధిలో ఉన్న వసతి గృహల్లో ఆహార నాణ్యత ను మెరుగు పర్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఇల్లందు atdo అధికారి అందుబాటులో లేని కారణంగా కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ కు సిపిఎం, tags నాయకులు ఖాదర్, వజ్జా సురేష్ లు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్బంగా వారు వినతిపత్రం ద్వారా వసతి గృహల్లో నెలకొని ఉన్న సమస్యలను వివరించడం జరిగింది. కూరగాయలు, గ్రుడ్లు,మాంసాహారం వంటివి నాణ్యత లోపించకుండ సరఫరా అయ్యే విధంగా చూడాలని కోరారు. రోజులు తరబడి నిల్వవున్న ఆహార పదార్దాలు కాకుండా స్వచ్ఛమైనవి సరఫరా చేయాలనీ పేర్కొన్నారు.పౌష్టిక ఆహారం అందడానికి అధికారులు పర్యవేక్షణ నిరంతరం జరుపుతూ వసతి గృహలని సందర్శించాలని కోరారు.