
*ఇట్టి గురుకుల పాఠశాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం
పాఠశాల ప్రిన్సిపాల్. ఆగమయ్య*
పయనించేసూర్యుడు న్యూస్.29.జనవరి. పుల్కల్ మండలప్రతినిది:- సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని సింగూరు గురుకుల పాఠశాలలో చుట్టుముట్టు గ్రామాల విద్యార్థులే కాకుండా ఇతర జిల్లాల నుండి భారీ మొత్తంలో విద్యార్థులు ఇక్కడ మెరుగైన విద్య అందుతుందనే ఉద్దేశంతో వారి తల్లిదండ్రులు టి గురుకుల పాఠశాలలో చేర్పించారు ఇక్కడ విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యార్థుల పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా అనునిత్యం విద్యతో పాటు క్రీడల్లో సైతం తమ గురుకుల పాఠశాల విద్యార్థులు జిల్లాలోనే కాకుండా రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలపాలనే ఉద్దేశంతో వారు విద్యార్థులతో పాటు ఇక్కడే రాత్రి వేళల్లో ఉంటూ విద్యార్థులకు తగిన సలహాలు సూచనలు అందించడంతోపాటు క్రీడల పట్ల ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే ఉద్దేశంతో తాము అనునిత్యం విద్యార్థుల కోసం పాటుపడుతున్నామన్నారు అంతేకాకుండా తమ గురుకుల పాఠశాలలో కొన్ని రకాల వసతులు లేక తమ విద్యార్థులు తీవ్ర నరకయాతన అనుభవిస్తున్నారని అట్టి విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయిన దామోద రాజనర్సింహ గారి దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే మంత్రివర్యులు స్పందించి వెంటనే గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలను గత రెండు నెలల్లో పూర్తి చేయాలని వారు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో వెంటనే తమ గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే దిశగా కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారన్నారు అంతేకాకుండా తమ గురుకుల పాఠశాలలో మరుగుదొడ్లు సరిగ్గా లేక మలవిసర్జన కోసం విద్యార్థులు పాఠశాల పక్కనే ఉన్న పంట పొలాల్లోకి వెళ్లడం పట్ల అట్టి పంట పొలాల రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు అట్టి రైతులు నేరుగా తమ పాఠశాలకు వచ్చి తమ గోడును వెల్లబోసుకుంటున్నారు ఇట్టి విషయాన్ని గమనించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ తమకు వారం పది రోజులు సమయం ఇవ్వండి ఆ సమస్యను పరిష్కరిస్తాం అని హామీ ఇచ్చి పంపిస్తున్నారు అసలు విషయం ఏమిటంటే గురుకుల పాఠశాల ఆవరణ నుంచి సింగూరు ఎడమ కాలువ పిల్లకాలువ రావడంతో ఎడమ కాలువ ద్వారా నీటిని వదిలినప్పుడు ఆ పిల్ల కాలువ ద్వారా నీటి సరఫరా కాకపోవడంతో గత రెండు సంవత్సరాల క్రితం సింగూరు ఇరిగేషన్ శాఖ అధికారులు జెసిబిల సాయంతో పాఠశాలలో అండర్ గ్రౌండ్ వేసిన పైపులను పూర్తిగా తొలగించడంతో పాటు తమ పాఠశాల ప్రహరీ గోడను కూడా కూల్చేశారు దీంతో విద్యార్థులు కాలకృత్యాలం కోసం పక్కనే ఉన్న పడ్న పొలాల్లోకి వెళ్లడంతో అక్కడి రైతులు తీవ్ర నరకయాత్ర అనుభవిస్తున్నారు ఇట్టి విషయాన్ని ఇటీవల రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి అయిన దామోదర్ రాయలసీమ గాలి దృష్టికి తీసుకెళ్లామని వారు వెంటనే స్పందించి వెంటనే అక్కడి ప్రహారాన్ని మూసివేయాలని ఆదేశించడం జరిగిందన్నారు కావున రైతులు అర్థం చేసుకొని వారం పది రోజులలోపు అట్టి గోడను నిర్మించి ఏ ఒక్క విద్యార్థి పంట పొలాల్లోకి రాకుండా చూస్తామని పాఠశాల ప్రిన్సిపాల్ అన్నారు కానీ పది రోజుల తర్వాత కూడా ఈ సమస్య పరిష్కారం అయ్యేనా అని ఇక్కడి రైతులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు పరిస్థితి ఇలాగే కొనసాగితే తమ బోరు బావుల వద్ద విద్యార్థులకు ఎలాంటి ప్రమాదాలు జరిగినా తమకు ఏమాత్రం సంబంధం లేదని రైతులు కరాకండిగా చెప్పారు కావున పాఠశాల ప్రిన్సిపాల్ వెంటనే ఆ సమస్యను పరిష్కరించే నా చూడవాల్సిందే