
పయనించే సూర్యుడు జనవరి 31 బచ్చన్నపేట మండలం జనగామ జిల్లా.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బచ్చన్నపేట లో వైటెక్ సొల్యూషన్ ఆసియా ప్రైవేట్ లిమిటెడ్ సహకారం తో ఏర్పాటు చేసిన నీటి శుద్ధీకరణ యంత్రాన్ని సంస్థ సభ్యులు ప్రారంభించారు.
ప్రధానోపాధ్యాయులు వెంకట్ రెడ్డి మాట్లాడుతూ పేద విద్యార్థులకు తాగునీటి సౌకర్యం కల్పించినందుకు యంత్రాన్ని ఏర్పాటు చేసిన సంస్థ సభ్యులకు కృతజ్ఞత అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు శ్రీనివాస్ జొన్నల, అనూష, శ్రావ్య రోహిత్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.