
పోలీసులకు విద్యార్థి సంఘాల నాయకుల మధ్య వాగ్వాదం
శాస్త్ర స్కూల్ గుర్తింపును రద్దు చేసే వరకు పోరాడుతామంటూ నినాదాలు చేసిన విద్యార్థి సంఘం నాయకులు
విద్యార్థి సంఘం నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు
తక్షణమే ఎంఈఓ మరియు డీఈఓ స్పందించి శాస్త్ర స్కూల్ గుర్తింపును రద్దు చేయాలి
శాస్త్ర స్కూల్ విద్యార్థి నీరజ్ కుటుంబానికి న్యాయం జరగాలి
ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎం పవన్ చౌహన్
ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 06 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జి మెగావత్ నరేందర్ నాయక్) షాద్నగర్ నియోజకవర్గం లో ఉన్నటువంటి శాస్త్ర స్కూల్ పదవ తరగతి చదువుతున్న విద్యార్థి నీరజ్ ఆత్మహత్య సంఘటనను నిరసిస్తూ అఖిలభారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ మరియు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది ఆ యొక్క స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని విద్యార్థి కుటుంబానికి న్యాయం జరగాలని వేలకు వేలు ఫీజులు తీసుకొని విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటు విద్యార్థుల శవాలను ఇంటికి పంపిస్తున్న ఇలాంటి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలపై క్రిమినల్ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా తక్షణమే శాస్త్ర స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ తో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు శివకుమార్ సహాయ కార్యదర్శి ఆకాష్ సాయి నరేష్ అమేర్ ఆకాష్ చౌహన్ ఎస్ఎఫ్ఐ షాద్నగర్ పట్టణ నాయకులు సుమేర్ శివ సాగర్ తదితరులు పాల్గొన్నారు