
పయనించే సూర్యుడు// ఫిబ్రవరి 5 // హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ // కుమార్ యాదవ్..
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ..సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను మోసం చేసే నాటకాలను నడుపుతోందని ధ్వజమెత్తారు.ఇందిరమ్మ ఇండ్లపై మోసం,హుజురాబాద్ నియోజకవర్గంలో 40 వేల మంది అర్హులుగా అధికారులు తేల్చినా, కేవలం 830 మంది ప్రజలకు నామమాత్రపు పత్రాలు అందజేస్తున్నారన్నారు.ఈ పత్రాలకు ఎటువంటి అధికారిక చట్టబద్ధత లేదు,అని ఇలా పత్రాలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టడం తగదన్నారు.ప్రజల సందేహాలకు సమాధానాలు లేవు,గ్రామసభల్లో ప్రజలు అధికారులను నిలదీయగా, ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేక అధికారులు ఉక్కిరి బిక్కిరి,అవుతున్నారన్నారు.హుజురాబాద్‌లో 40 వేల ఇండ్లకు పత్రాలు ఇవ్వాలి రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల ఇండ్లకు పత్రాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది, ప్రజలు వీటిని నమ్మి ఇళ్లు కట్టుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం డబ్బులు ఇవ్వక మోసం చేసే అవకాశం ఉందన్నారు. జాగా లేని వారికి స్పష్టత లేదు: ఇండ్ల కేటాయింపు ప్రక్రియలో పేదలకు, భూమిలేని వారికీ ఎటువంటి స్పష్టత లేదు, అని తెలిపారు.రైతు బంధు వంచన:• హుజురాబాద్‌లో కేవలం 586 మంది పేర్లను మాత్రమే జాబితా నుంచి తొలగించారు, కానీ రాష్ట్రవ్యాప్తంగా కేవలం 1% మందిని మాత్రమే తొలగించారన్నారు.• 20,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయిందని అసెంబ్లీలో ఆరోపించిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు కేసీఆర్ తయారు చేసిన జాబితాకే రైతు బంధు ఇస్తున్నారన్నారు. ఇప్పటివరకు రైతులకు 20 వేల కోట్ల రూపాయలు వృధా అయ్యాయని అన్న రేవంత్, ఇప్పుడు అదే లబ్ధిదారులకు మళ్లీ ఎలా ఇస్తున్నాడు?అని ప్రశ్నించ్చారు.రేవంత్ రెడ్డి తుగ్లక్ పాలన అని, ఒక రోజు రైతు భరోసా డబ్బులు ఇచ్చి, ఆ తర్వాత ఆపేశారన్నారు.ఎన్నికల కోడ్ పేరు చెప్పి ఆరు నెలలపాటు రైతులకు డబ్బులు ఇవ్వకుండా కుట్ర జరుగుతోంది అని వివరించారు.
కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో నిర్వహించిన పోల్‌లో 70% మంది కేసీఆర్ పాలన బాగుందని చెప్పడం కాంగ్రెస్‌కు తలదన్నే విషయంగా మారిందఅన్నారు. మరో సర్వేలో 80% మంది కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని, సునీల్ కనుకోలు 10 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చాలని ప్రయత్నించి, ఓటింగ్‌లో ప్రజల చేత చెంపచెళ్లుమనిపించుకున్నాడన్నారు. బి ఆర్ ఎస్ విజయం – హుజురాబాద్‌లో దళితబంధు రెండో విడత నిధుల మంజూరు, అని ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలే హుజురాబాద్‌లో విజయాన్ని అందించాయని పేర్కొన్నారు.
ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిన తర్వాతే స్థానిక ఎన్నికలు జరగాలన్నారు.రేవంత్ రెడ్డి ఓ పెద్ద జోకర్, అని కొండను తవ్వి ఎలుక ను పట్టినట్టు రేవంత్ పాలన సాగుతోందన్నారు. తెలంగాణ ప్రజలకు మేలు చేసేందుకు వచ్చిన పాలకుడు కాదు, అని కేవలం డ్రామాలు ఆడే వ్యక్తి మాత్రమే,అని తుగ్లక్ పాలన సాగిస్తూ, ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడన్నారు.
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ మోసాన్ని గుర్తించి తగిన గుణపాఠం చెప్తారని మాట్లాడారు.