
జనం న్యూస్ 2 జనవరి భీమారం మండల ప్రతినిధి (కాసిపేట రవి )=భీమారం మండలం నర్సింగాపూర్ గ్రామపంచాయతీ బస్టాండ్ నుండి ఖాజీపల్లి బస్టాండ్ సమీపలలో ఖాళీ స్థలంలో చీకటి పడితే చాలు మందుబాబులకు అడ్డలుగా మారుతుంది.చుట్టుపక్కల జనసంద్రం లేని కారణంగా ఎక్కువ శాతం ఎక్కడపడితే అక్కడ మద్యం సేవించి ఖాళీ బాటిళ్లను సైతం అక్కడే పగల కొట్టి వెళుతున్నారు.ఎక్కడ చూసినా చుట్టుపక్కల పరిసరాలలో వాటర్ ప్యాకెట్లు మద్యం సీసాలు దర్శనమిస్తున్నాయి.ఇది ఇలా ఉండగా అదే దారిలో కాలేజీలకు వెళ్లి ఆడపిల్లలకు ప్రయాణికులకు మందుబాబులు మద్యం సేవించి పగలకొట్టిన బాటిల్లను వారి చేతులు మీదుగా పక్కన పడేసి వెళ్ళవలసి వస్తుంది . ఇప్పటికైనా పోలీస్
అధికారుల స్పందించి ఇకమీదట ఇటువంటి జరగకుండా చూసుకోవాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.