
తహశీల్దార్ ప్రవీణ్ ను కలిసి వినతిపత్రం అందజేసిన లంబాడా నాయకులు
పయనించే సూర్యుడు జనవరి 16
ఆదిలాబాద్ జిల్లా మండలం ఉట్నూర్
రిపోర్టర్ షైక్ సోహెల్ పాషా
ఉట్నూర్ మండలకేంద్రంలోని సేవాలాల్ భవన నిర్మాణానికి ప్రభుత్వం భూమిని కేటాయించాలని లంబాడ నాయకులు గురువారం తహశీల్దార్ ప్రవీణ్ ను కలిసి వినతిపత్రం అందించారు ఈసందర్భంగా భరత్ చౌహన్ మాట్లాడుతూ.. సేవాలాల్ భవనం ఆలయ నిర్మాణానికి పెరికగూడలో కేటాయించిన స్థలం వద్దన్నారు పట్టణంలోనే ఏ రకమైన సమస్యలు లేని భూమిని తమకు కేటాయించాలని కోరామన్నారు