Saturday, March 1, 2025
Homeఆంధ్రప్రదేశ్హామిలు అమలు చేయకుంటే ప్రజలను మోసం చేసినట్టే

హామిలు అమలు చేయకుంటే ప్రజలను మోసం చేసినట్టే

Listen to this article

ప్రజలను మభ్య పెడుతున్న కూటమి ప్రభుత్వం

పయనించే సూర్యుడు జనవరి 31 ( ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)

ఇచ్చిన హామిలను నూరుశాతం అమలు చేసిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదే
మీడియా సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు మాట్లాడుతూ
ఎన్నికల సమయంలో ప్రజలకు సూపర్ సిక్స్ పేరుతో హామిలను గుప్పించి అధికారంలోకి వచ్చిన అనంతరం హామిల అమలు చేయలేమంటూ కల్లబొల్లి మాటలు చెబుతున్నారని, ఇలా చేస్తే ప్రజలను మోసం చేసినట్టే అవుతుందని వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ సీహెచ్ ఆదిశేషయ్య, పట్టణ అధ్యక్షుడు నాగులపాటి ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు.
ఆత్మకూరు మేకపాటి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆదేశాలతో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకలను కూటమి ప్రభుత్వం తప్పకుండా అమల చేయాలని అన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత రూ.1.13లక్షల కోట్లు అప్పులు చేసిన కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా వదిలిస్తే ఎలా అని ప్రశ్నించారు.
గతంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్న సమయంలో నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందచేశారని. ఆయన తీసుకొచ్చిన గ్రామ సచివాలయం .వాలంటీర్ వ్యవస్థలతో ప్రతి ఇంటికే ప్రభుత్వసంక్షేమ పథకాలు అందాయన్నారు. అధికారం చేపట్టిన ఆరు నెలల కాలంలోనే రైతు భరోసా. అమ్మఒడి. చేయూత. ఫీజు రీయంబర్స్ మెంట్. ఆరోగ్యశ్రీ, ఆసరా. సున్నావడ్డి లాంటి పథకాలను అమలు చేసి ప్రజలందరిని ఆర్థికంగా బలోపేతం చేశారన్నారు.
ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబునాయుడు ఈ సంక్షేమ పథకాలతో రాష్ట్రం మరో శ్రీలంకగా మారుతుందంటూ ఉపన్యాసాలు ఇచ్చారని గుర్తు చేశారు. అయితే ఎన్నికల సమీపించిన తరుణంలో ప్రతి సమావేశంలోనూ సూపర్ సిక్స్ హామిలతో ఊదరగొట్టారని. ఆయనమాటలు నమ్మిన ప్రజలు గెలిచిన అనంతరం హామిలు అమలు చేయకపోవడంతో ఇదేమి ప్రభుత్వమంటూవిమర్శలకు దిగుతున్నారన్నారు.
ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద రూ.15వేలు. మహిళలకు నెలకు రూ.1500లు. రైతులకు అన్నదాతసుఖీభవ పథకం కింద రూ.20వేలు. నిరుద్యోగ భృతి. జాబ్ క్యాలెండర్. మహిళలకు ఉచిత బస్సు అంటూ ఎన్నో హామిలిచ్చారని. అయితే ఇప్పుడవన్ని అమలు చేయాలంటే భయమేస్తుందంటూ చెప్పడం సమంజసం కాదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ది పనులను, పోర్టులను ప్రస్తుతం ప్రైవేటికరణ చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని, గతంలో వచ్చిన పెట్టుబడులు, ఇప్పుడు రాని పరిస్థితి అని పేర్కొన్నారు.
వైఎస్సార్సీసీపీ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమం కన్నా మరెవరూ ఎక్కువగా ఇవ్వలేరని, చంద్రబాబు హామిలను నమ్మి మోసపోవద్దని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో చేసిన హెచ్చరికలు ఇప్పుడునిజమయ్యాయని గుర్తు చేశారు. 2014లో 600 హామిలిచ్చి వాటిని గాలికి వదిలేశారని. 2024లో సూపర్ సిక్స్ హామిల అమలకు ఎన్నో అవాంతరాలుచెబుతున్నారనిఅన్నారు.కూటమిప్రభుత్వ హామలన్నింటిని నెరవేర్చేలా పోరాటాలు చేసేందుకు రాబోయే రోజుల్లో ప్రజలు వైఎస్సార్సీపీకి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, మేకపాటి విక్రమ్ రెడ్డికి అండగా నిలవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ మాజీ జిల్లా అధ్యక్షులు కొండా వెంకటేశ్వర్లు, ఆండ్రా సుబ్బారెడ్డి. కొప్పోలు వెంకటేశ్వర్లు .పాలేటి వెంగళరెడ్డి, కల్పనారెడ్డి, తోడేటి మణి, చైతన్య తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments