అండర్ గ్రౌండ్ డ్రైనేజి పనులను ప్రారంభించిన అన్నారం సర్పంచ్ లావణ్య రామకృష్ణ

September 22, 2026 | తెలంగాణ

కొండయ్య గడ్డ తండాలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు

( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 23 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )ఫరూక్ నగర్ మండల అన్నారం గ్రామపంచాయతీ పరిధిలోని కొండయ్య గడ్డ తండాలో సర్పంచ్ లావణ్య రామకృష్ణ ఆధ్వర్యంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపడుతున్నారు. గ్రామంలో పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించేందుకు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఒగ్గుల శివశంకర్ యాదవ్, మార్కెట్ పీఏసీ డైరెక్టర్ లంకల రఘు గౌడ్, పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు జి. శ్రీశైలం యాదవ్, సి. యాదయ్య, పి. రవి, లంకల దేవేందర్, లంకల సురేష్, పి. రమేష్, ఎస్. లింగం, కె. గోపాల్ నాయక్, పి. సీతు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper