తెలంగాణ

పదో తరగతి విద్యార్థులకు ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆల్ ఇన్ వన్ పుస్తకాల పంపిణీ చేసిన బోస్లే మోహన్ రావు పటేల్

పదో తరగతి విద్యార్థులకు ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆల్ ఇన్ వన్ పుస్తకాల పంపిణీ చేసిన బోస్లే మోహన్ రావు పటేల్

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని చుచుంద గ్రామంలో ఉన్న జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రజా ట్రస్ట్ చైర్మన్ శ్రీ బోస్లే మోహన్‌రావు పాటిల్ స్వయంగా తన చేతుల మీదుగా విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ పుస్తకాలను అందజేశారు. విద్యార్థులు చదువులో మంచి ప్రతిభ కనబరిచి, పదో తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.అదేవిధంగా తానూర్ మండలంలోని భోసి గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కూడా పదో తరగతి విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ పుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది.విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడుతూ, వారి భవిష్యత్తుకు బాటలు వేయాలనే లక్ష్యంతో ఈ పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. విద్యార్థుల కు చదువులో అవసరమైన సహాయాన్ని అందిస్తూ, వారు ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రజా ట్రస్ట్ ఎల్లప్పుడూ కృషి చేస్తోంది.ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రజా ట్రస్ట్ చైర్మన్ శ్రీ బోస్లే మోహన్‌రావు పాటిల్ కు కృతజ్ఞతలు తెలిపారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS