
పయనించే సూర్యుడు ఏప్రిల్ 14 నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్
- జిల్లా ప్రజలకు కాంగ్రెస్ శ్రేణులకు మానాల మోహన్ రెడ్డి పిలుపు
ఈ రోజు రాజ్యాంగ నిర్మాత భారత రత్నా డా బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు,రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.అనంతరం పులాంగ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందాన్,నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, నుడా చైర్మన్ కేశ వేణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి దేశవ్యాప్తంగా ప్రజలందరూ రాజ్యాంగం ద్వారా ఫలాలు పొందుతున్న సందర్భంలో పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత డా బాబా సాహెబ్ అంబేద్కర్ గారినీ అవమానించింది బీజేపీ నాయకులు, కానీ వారే నిన్నటి రోజు అంబేద్కర్ విగ్రహాలను శుద్ధికారణ చేస్తూ వారి పాపాలను కాదుకున్నే ప్రయత్నం చేశారు.కానీ బిజెపి నాయకులు పాపపు చేతులతో దేవుడి లాంటి అంబేద్కర్ విగ్రహాన్ని తాకినందుకు రేపు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి మళ్ళీ శుద్ధి చేయాల్సిన అవసరం వుంది.కావున అన్ని వర్గాల ప్రజలు రేపు 10 గంటలకు పులాంగ్ వద్దకు రావాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాలు సమాన హక్కులతో ముందుకు వెళ్తున్నాయి అంటే అది రాజ్యాంగం వల్లనే అని, కాంగ్రెస్ పార్టీ ఏ రోజు అంబేద్కర్ ని అవమానించలేదు అని, అంబేద్కర్ కొందరి వాడు కాదు అందరి వాడు అని, రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాలకు హక్కులు కల్పించడంతో పాటు తెలంగాణ రావడానికి ముఖ్య కారణంగా రాజ్యాంగం ఉంది అని ఆయన అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కొరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభించిన జై బాపు జై భీం జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రజలందరూ విజయవంతం చేయాలనీ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అనేది అందరికీ స్వేచ్య, స్వాతంత్యం హక్కు ఇచ్చిందని, అందుకే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జన్మదినం మనకు ప్రత్యేకమని, అంబేద్కర్ జయంతి కన్నా ముందు రోజు అధికారికంగా ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహాలను శుద్ధి చేస్తారని, కానీ కేవలం పేపర్ లో రావడానికి బీజేపీ నాయకులు శుద్ధి ఆనే కార్యక్రమం చేశారని, తద్వారా వీరి పాపాల పోతాయి అనుకున్నారు కానీ పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ ని అవమానించింది బీజేపీ నాయకులను దుయ్యబట్టారు. రాజ్యాంగ పరిరక్షణ మన బాధ్యతగా అందరూ ముందుకు వెళ్లాలని, జై బాపు జై భీం జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం ఈ నెల 20 వ తేదీ నుండి సరికొత్త రూపంలో ముందుకు వెళ్తుందని, అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత కాంగ్రెస్ నాయకులపై ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంత రెడ్డి రాజా రెడ్డి, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, రాష్ట్ర ఎన్ ఎస్ యు ఐ ప్రధాన కార్యదర్శి వేణు రాజ్,జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగం,జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్,జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్,రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావేద్ అక్రమ్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్,పిసిసి మాజీ కార్యదర్శి రామ్ భూపాల్,నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి,నగర సెల్ అధ్యక్షులు వినయ్,మహిళా కాంగ్రెస్ నాయకులు పోల ఉష, తంబకు చంద్రకళ,గాజుల సుజాత,మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఈసా,యూత్ కాంగ్రెస్ నాయకులు సుమన్ మరియు తదితరులు పాల్గొన్నారు
