డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా
పయ నించే సూర్యుడు ఏప్రిల్ 22 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వారోత్సవాలు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా, పి. గన్నవరం మండలంలో మండల అధ్యక్షులు తిక్కా సత్యనారాయణ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, మాజీ శాసనసభ్యులు మానేపల్లి అయ్యాజీ వేమా రాష్ట్ర అధికార ప్రతినిధి *నల్లా పవన్ కుమార్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల జిల్లా కన్వీనర్ **చీకరమెల్లి శ్రీనివాసరావు హాజరయ్యారు. అయ్యాజీ వేమా మాట్లాడుతూ. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం డా. అంబేద్కర్‌ను అనుసరించిన వైఖరికి నిరసనగా ఆయన న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారని, ప్రజలకు ఆ విషయాలు తెలియజేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్‌కు *భారతరత్న* బహూకరించడం జరిగిందని, అలాగే నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్‌తో ముడిపడిన పంచ తీర్థాలు (జన్మభూమి, శిక్షభూమి, దీక్షాభూమి, మహాపరినిర్వాణ భూమి, చైత్య భూమి)ను గుర్తించి, వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిందని తెలిపారు. అడబాల సత్యనారాయణ మాట్లాడుతూ…
కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం డా. అంబేద్కర్ ఆలోచనలు, విధానాలకు అనుగుణంగా బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. అంబేద్కర్ లేకపోతే భారతదేశం వేరే విధంగా ఉండేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన్ని అడుగడుగున అవమానించిందని వివరించారు. నల్లా పవన్ కుమార్ మాట్లాడుతూ డా. అంబేద్కర్ ఆలోచనలు, విధానాలకు కట్టుబడి రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ మోదీ ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. దీని భాగంగా 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు పోనుగుపాటి శ్రీనివాస్, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు షంసు సాదిక్, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మేడిది సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు **తోలేటి సుబ్బారావు, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు పసుపులేటి వెంకటేశ్వరరావు, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు దిగుమర్తి ఏడుకొండలు, జిల్లా మాజీ కన్వీనర్ అడ్డాల వెంకటేశ్వరరావు, జిల్లా బిల్డింగ్ వర్కర్స్ సెల్ కన్వీనర్ సిట్నీడి రంగసాయి, మండల ఉపాధ్యక్షులు చీకరమెల్లి సుబ్రహ్మణ్యం, మండల కోశాధికారి *బొడ్డు రామకృష్ణ, బిజెపి నాయకులు గంట పెద్దిరాజు, కుడుపూడి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.