
పేరూరు ఎస్ఐ. జి. కృష్ణ ప్రసాద్.
పయనించే సూర్యుడు: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి. రామ్మూర్తి.ఎ. వాజేడు: ములుగు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాజేడు మండలంలోని పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉన్న రాంపూర్, భీమారం ఇసుక క్వారీలను రెవెన్యూశాఖ వారితో కలసి పేరూరు ఎస్.ఐ.,జి.కృష్ణ ప్రసాద్, ఫిబ్రవరి 15 శనివారం సందర్శించారు.ఇసుక క్వారిలోని రవాణా ధారులకు మరియు క్వారీ యాజమాన్యానికి జి. కృష్ణ ప్రసాద్ ఎస్ఐ పేరూరు మాట్లాడుతూ పలు హెచ్చరికలు జారీచేశారు. లారీల వాహన దారులకు మరియు సరియగు డీడీ లు లేకుండా, ఒక లారికి బధులు మరో లారీ లో ఇసుక తరీలంచినా , సూచించిన మేరకు కాకుండా అధిక లోడ్ తరలించిన, మరయు క్వారీ నిర్వహించు యాజమాన్యం వారు ప్రభుత్వ సూచనలను ఉల్లంగినచి ,జె సి బి.ల, లోడింగ్ ఛార్జీలు వసూలు చేసిన మరియు ఇతరత్రా అక్రమాలకు పాల్పడిన వారి పై చట్టరీత్యా తగు కఠిన చర్యలు తీసుకోబడునని హెచ్చరించారు. ఎవరైనా సరే ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సిందే నని తెలియ జేశారు.