Thursday, May 15, 2025
Homeఆంధ్రప్రదేశ్అఖిల భారత ఐక్య రైతు సంఘము బృందము కలెక్టర్ ని కలిసి విజ్ఞప్తి చేశారు

అఖిల భారత ఐక్య రైతు సంఘము బృందము కలెక్టర్ ని కలిసి విజ్ఞప్తి చేశారు

Listen to this article

పయనించే సూర్యుడు మే 15 నిజామాబాద్ జిల్లా బ్యూరో టీ కే గంగాధర్

తెలంగాణ నిజాంబాద్ జిల్లా లో

కలెక్టరేట్ నిజామాబాద్..నిజాంబాద్ జిల్లా పరిధిలో సుమారుగా రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం (జాతీయ రహదారుల)రోడ్లపై కుప్పల్ తేప్పలుగా పడిఉన్న ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లర్లకు తరలించాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం.. బృందం కలెక్టర్ ని కలిసి విజ్ఞప్తి చేశారు.అఖిలభారత ఐక్య రైతు సంఘం. ఐ యు కె ఎస్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం. జిల్లా కలెక్టర్ గారిని కలిసిన సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. వి. ప్రభాకర్. రాష్ట్ర కార్యదర్శి.. బి దేవారం మాట్లాడుతూ ..జిల్లాలో ఆర్మూర్. భీంగల్. జక్రాన్ పల్లి. మాక్లూర్. నందిపేట్ మండలాల్లో సుమారుగా 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం 45 రోజులుగా రోడ్లపైనే కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయని వర్షానికి నానుతూ ఎండకు ఎండుతూ దర్శనమిస్తున్నాయి అన్నారు.
ఈ పరిస్థితిని జిల్లా కలెక్టర్ గారిని కలిసి యుద్ద ప్రాతిపదికన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతుల దీనావస్థను వివరించడం జరిగింది. జిల్లాలో రైస్ మిల్లర్లుముఖ్యంగా భీంగల్. మాక్లూర్. ముచ్కూర్. కొనుగోలు కేంద్రాల నిర్వహకులు రైస్ మిల్ యజమాలతో కుమ్మక్కై అధిక తరుగుతీసుకుంటున్నారని రైతులు వాపోయారని విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగిందని అన్నారు. ఇప్పటికే క్వింటాలకు 4 నుంచి 5 కిలోల తరుగు తీసుకుంటున్నారని రైస్ మిల్లర్స్ లారీలను వారం రోజుల వరకు కూడా ఖాళీ చేయడం లేదని డ్రైవర్లతో రైతులకు ఫోన్లు చేయించి మాపై ఫిర్యాదు చేయకుండా ఎంత ఎక్కువ తొలగిస్తే అంత తొందరగా దించుకుంటామని అంటున్నారని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగింది అన్నారు.లారీల కొరత ఏర్పడితే పక్క జిల్లాల నుండి అయినా తెప్పించి ఈ సమస్యను పరిష్కరించకపోతే వాతావరణ శాఖ హెచ్చరించినట్లుగా వర్షాలు ముందుగానే వచ్చే అవకాశాలు ఉన్నాయని ఈ ప్రమాదం నుండి తప్పించాలని విజ్ఞప్తి చేశారు.కలెక్టర్ వీలైన తొందరగా ధాన్యాన్ని మొత్తం సేకరిస్తామని ఇప్పటికే చాలా మేరకు సేకరించామని రైతులు ఓపీక పట్టే విధంగా చూడండి అని అన్నారని అన్నారు.జక్రాన్ పల్లి మండల పరిధిలోని పుప్పాలపల్లి గ్రామంలో ఉపాధి హామీ సామాజిక తనిఖీలో ఇంచార్జ్ ఫీల్డ్ అసిస్టెంట్ పైన అనేక అవినీతి ఆరోపణలు దేశం లో లేని వారికి కూడా హాజర్ పట్టికలో (దుబాయిలో పనిచేసుకుంటున్న వారి పేర్లు). మోడల్ స్కూల్లో కాంట్రాక్ట్ టీచర్ గా పని చేస్తున్న వారి పేర్లు కిరాణా షాపు నిర్వహించుకుంటున్నా వారి పేర్లు రిజిస్టర్లో నమోదు చేశారని అంతేకాకుండా పనిచేసిన వారి పేర్లను మాత్రం హాజరులో లేకపోవడం శోచనీయమని ఇన్చార్జి ఫీల్డ్ అసిస్టెంట్ ని తొలగించాలని డిమాండ్ చేస్తుండగా డిఆర్డిఏ జిల్లా అధికారులు మాత్రం రూరల్ శాసనసభ్యుడు డాక్టర్ భూపతి రెడ్డి కంటిన్యూ చేయమన్నారని చెప్పడం శోచనీయమనిఅన్నారుఎమ్మెల్యే అవినీతిపరులని కాపాడడం కోసమే ఉన్నారని గ్రామస్తులు అధికారులు నిలదీశారని అన్నారు.కలెక్టర్ ని జిల్లా డి ఆర్ డి ఏ అధికారులు కలిసిన బృందంలోఅఖిలభారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ సురేష్. కార్యదర్శి.. బి బాబన్న. నాయకులు.. బి కిషన్. ఆల్ గొట్ సాయిలు. టి గంగాధర్. గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.ఉద్యమ అభినందనలతో…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments