షాద్ నగర్ గ్రంధాలయ అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్ నక్క బాల్ రాజ్ యాదవ్ కు సన్మానం
( పయనించే సూర్యుడు జనవరి 31 షాద్నగర్ నియోజకవర్గం ఇన్చార్జి మెగావత్ నరేందర్ నాయక్ )
అఖిల భారత యాదవ మహాసభ మహబూబ్ నగర్ పట్టణ కమిటీ అధ్యక్షులు తాటికొండ నరసింహ యాదవ్ మరియు ఉపాధ్యక్షులు రామకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక యాదవ సంఘం కార్యాలయంలో అఖిల భారత యాదవ మహాసభ షాద్ నగర్ పట్టణ అధ్యక్షులు నక్క బాల్ రాజ్ యాదవ్ నూతనంగా షాద్ నగర్ గ్రంథాలయ కమిటీ వైస్ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వారిని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కార్యదర్శి మరియు అడ్వకేట్ ఎల్గనమోని రవి కుమార్ యాదవ్, మహబూబ్ నగర్ తాలూకా అధ్యక్షులు సాయిలు యాదవ్, ఉపాధ్యక్షులు నంబి రమేష్ యాదవ్ లతోపాటు మహబూబ్ నగర్ జిల్లా నాయకులు, నియోజకవర్గ మరియు పట్టణ కమిటీ నాయకులు పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది. ఈ సందర్భంగా నక్క బాల్ రాజ్ యాదవ్ మాట్లాడుతూ మీ ఆప్యాయతకు అభిమానానికి సౌహృదయంతో నన్ను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపిన యాదవ కుల బంధువులందరికీ… ముఖ్యంగా అడ్వకేట్ ఎల్గనమోనీ రవికుమార్ యాదవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.