అగ్నిప్రమాద బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు& గుత్తులు సాయి
పయ నించే సూర్యుడు జూలై 9 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ)డా|| బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం గుత్తినదీవి గ్రామంలోని కరవాకులంకకు చెందిన తాళ్ల సత్యవతి నివాసంలో ఇటీవల సంభవించిన అగ్నిప్రమాదంలో ఇల్లు పూర్తిగా దగ్ధమై తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, డా|| బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టిడిపి అధ్యక్షులు గుత్తుల సాయి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా తాళ్ల సత్యవతి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం ద్వారా ఉచితంగా ఇంటి నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.అదేవిధంగా బాధిత కుటుంబానికి నిత్యావసర సరుకులు అందించారు. అగ్నిప్రమాదం వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి బాధిత కుటుంబానికి తగిన సహాయం అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.అనుకోని ప్రమాదంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం తమకు అండగా నిలుస్తాయని దాట్ల సుబ్బరాజు భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో ఐ.పోలవరం టిడిపి మండల పార్టీ అధ్యక్షులు సాగిరాజు సూరిబాబు, ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కాకర్లపూడి రాజేష్, పురుషోత్తం, స్థానిక నాయకులు బుల్లియ్య, ఎస్సై, తహసీల్దార్, స్థానిక నాయకులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.