జూలూరుపాడు. జనవరి16 మండలం. పయనించే సూర్యుడు. యూసఫ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పోదేం వీరయ్య. ఈరోజు భద్రాచలం పట్టణ పరిధిలోని వారి స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించిన జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాలోత్ మంగీలాల్ నాయక్.
ఈ సందర్భంగా పోదేం వీరయ్య గారు జూలూరుపాడు మండలంలోని రాజకీయ పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా కష్టపడిన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షులు అల్లాడి నరసింహారావు, మండల ఉపాధ్యక్షులు లకావత్ లచ్చు నాయక్, మండల ఓబీసీ సెల్ అధ్యక్షులు గోపు రామకృష్ణ,మండల సేవాదళ్ అధ్యక్షులు వాంకుడోత్ కిషన్ నాయక్, కోర్రా రవి చందర్ మరియు తదితరులు పాల్గొన్నారు.