
పయనించే సూర్యుడు// న్యూస్ మే 18//మక్తల్ రిపోర్టర్ సీ తిమ్మప్ప//
మక్తల్ : జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారుల అలసత్వంతో మక్తల్ మండలంలోని అన్నదాతలు అవస్థలు పడుతున్నారని మాజీ ఎంపీటీసీ జి. బలరాం రెడ్డి అన్నారు. మక్తల్ మండలంలోని పలు ప్రాంతాల్లో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాల్లో వేలాది మంది రైతుల నుంచి వడ్లను కొనుగోలు చేయడం జరిగిందన్నారు. అయితే ఇక్కడి వడ్ల కొనుగోలు కేంద్రాల నుంచి జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి లోని ఎస్ఆర్ టి రైస్ మిల్లుకు ఐకెపి అధికారులు ట్రక్కు చిట్టిలను రాసి దాదాపు 40 లారీల వడ్లను పంపడం జరిగిందన్నారు. అయితే ఆ వడ్లను పంపినప్పటికీ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారుల నుంచి మిల్లు యాజమాన్యానికి ఓపిఎంఎస్ జారీ చేయకపోవడంతో ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో వడ్లకు సంబంధించిన డబ్బులు జమ కాలేదన్నారు. వడ్లను విక్రయించి దాదాపు నెలరోజులు గడుస్తున్నప్పటికీ అధికారుల అలసత్వం కారణంగా అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అన్నదాతలకు తక్షణమే డబ్బు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో బిజెపి ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని ఆయన అన్నారు.