
పయనించే సూర్యుడు. ఫిబ్రవరి 7. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ . గుగులోత్ భావుసింగ్ నాయక్.*సమాచార హక్కు 2005 చట్ట ప్రకారం సమాచారం అడగగా తప్పుల తడకగా*చూపిస్తున్నారు రికార్డ్ వెరిఫికేషన్ చేయగా అంతా అధికారుల నిర్లక్ష్యమే కనపడుతుందివైరా నియోజకవర్గం జూలూరుపాడు కొమ్ముగూడెం గ్రామపంచాయతీలో చేసినటువంటి అభివృద్ధి పనుల వివరాలు సంబంధిత అధికారులను అడగగా వారు 8 నెలలు టైం తీసుకుని ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామంటూ పక్కకు జరుపుకుంటూ వచ్చారే తప్ప పక్కా సమాచారం ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భారతీయ గోర్ బంజారా పోరాట సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బానోత్ దుర్గాప్రసాద్ అధికారుల చుట్టూ ప్రదర్శనలు చేయగా ఒకరోజు రికార్డ్ వెరిఫికేషన్ చేసుకోండి అంటూ నోటి మాటగా చెప్పారు సంబంధిత అధికారులు నేను కొమ్ముగూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలోకి వెళ్లి మొదటిసారి వెరిఫికేషన్ చేయగా అంతా తప్పులు తప్పులుగా కొన్ని వాటికి బిల్లులు లేకుండా పేరు లేకుండా పంచాయతీ పరిధిలో అభివృద్ధి పనులు చెయ్యకపోయినా చేసినట్లుగా చెప్పి లక్షల డబ్బులు కాజేశారు గత ఐదు సంవత్సరాల నుండి బ్లీచింగ్ పౌడర్ చల్లలేదు సైడ్ డ్రైనేజీ కూడికలు తీయలేదు పిచ్చి మొక్కలు తొలగించలేదు మొక్కలు నాటలేదు వాటికి నీరు పోయలేదు అయినా కానీ అవి పనులు చేశామంటూ లక్షల డబ్బులు బిల్లులు చేసుకొని ఉన్నటువంటి పరిస్థితి కనపడగా నేను ఆ రోజే అధికారులను ప్రశ్నించగా సంబంధిత అధికారి నాకు ఏమీ తెలియదు నేను కొత్తగా వచ్చాను అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు మరలా ఒక రోజు రండి పూర్తి సమాచారం అందిస్తామంటూ తెలపగా నాడు నేను మరలా వెళ్లి రికార్డులు వెరిఫికేషన్ చేయగా అవి కూడా మొత్తం తప్పుల తడాఖా ఉంది ఒక్క బిల్లు కూడా లేనటువంటి పరిస్థితి అదే విధంగా ఓచర్ల కూడా లేనటువంటి పరిస్థితి ఎంబి బిల్స్ కూడా మెయింటైన్ చేయనటువంటి పరిస్థితి పంచాయతీ కార్యాలయంలో ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మరి అమాయకమైన గిరిజనులు నివసించేటటువంటి కొమ్ముగూడెం గ్రామపంచాయతీలో ఎన్నో లక్షల పెట్టి అభివృద్ధి పనులు చేశామంటూ చెప్పుకొచ్చారు అలాంటి అభివృద్ధి పనుల వివరాలు అడిగితే చెప్పనటువంటి పరిస్థితి కొమ్ముగూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉందని ఆయన అన్నారు ఏది ఏమైనా ఈ తప్పుల వివరాలన్నిటినీ గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లి నిర్లక్ష్యం వహించినటువంటి సంబంధిత అధికారులపై అదేవిధంగా మాజీ ప్రజాప్రతినిధులపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతానని ఆయన తెలియపరిచారు అక్కడ కూడా న్యాయం జరగకుంటే గౌరవ కోర్టు దాకా వెళ్లి నిర్లక్ష్యం వహించినటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరతారని వారు తెలియజేశారు