
పయనించే సూర్యుడు అనంతపురం టౌన్ ప్రతినిధి నాగేంద్ర ఫిబ్రవరి 3
రాయలసీమ గిరిదుర్గాలలో ఎంతో ప్రసిద్ధిగాంచిన గుత్తి కోటను అభివృద్ధి చేయాలని గుత్తి కోట సంరక్షణ సమితి వ్యవస్థాపకుడు అధ్యక్షుడు విజయభాస్కర్ జిల్లా పురావాస్తు శాఖ అధికారి రాజా యోగేష్ కు విన్నవించారు. అనంతపురం పురావస్తు శాఖ కార్యాలయంలో సోమవారం విజయ్ భాస్కర్ పురావస్తు శాఖ అధికారిని కలిశారు. ఈ సందర్భంగా గుత్తి కోటను అభివృద్ధి చేయవలసిన ఆవశ్యకత గురించి పురావస్తు శాఖ అధికారికి విజయభాస్కర్ వివరించారు.