
పయనించే సూర్యుడు న్యూస్ : జనవరి 18అనంతసాగరం మండలం, నెల్లూరు జిల్లా (రిపోర్టర్: వెంకటరమణారెడ్డి)… మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాలతో మరియు మెట్టుకూరు ధనుంజయ రెడ్డి సూచనలతో,అనంతసాగరం మండల కేంద్రంలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఆయన చేసిన అపారమైన సేవలను గౌరవంగా స్మరించుకున్నారు.మెట్టుకూరు కృష్ణా రెడ్డి మరియు మండల అధ్యక్షులు మునగపాటి సునీత సుబ్బరాజు ఆధ్వర్యంలో, ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం విజయవంతంగా నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసిన నెల్లూరు పార్లమెంట్ తెలుగు యువత కార్యనిర్వాహ కార్యదర్శి కమ్మ ప్రభాకర్ నాయుడు మరియు తెలుగు యువత నాయకులు శావా కార్తీక్ చౌదరి పై కార్యక్రమం లో గౌరవరం సర్పంచ్ శాకమూరి సుబ్బారావు గారు, శంకరనగరం మాజీ సర్పంచ్ శాకమూరి వెంకటేశ్వర్లు నాయుడు, కేత శ్రీనివాసులు రెడ్డి చల్లా శివారెడ్డి, ఖాసీం బాషా , కొత్తపల్లి మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి , ఎంపీటీసీ రాపూరు సుజాత , మెట్టుకూరు మనోజ్ రెడ్డి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.