
బట్టలు, పండ్లు పంపిణీ చేసిన సామాజిక కార్యకర్త..
పయనించే సూర్యడు // మార్చ్ //31// కుమార్ యాదవ్(హుజురాబాద్)హుజురాబాద్ పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త ప్రముఖ వ్యాపారి వర్ధినేని రవీందర్ రావు- లక్ష్మీ దంపతులు ఆదివారం ఉగాది వేడుకలను జమ్మికుంటలోని స్పందన అనాధ శరణాలయంలో ఉగాది వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా రవీందర్ రావు లక్ష్మీ దపతులు సుమారు 30 మంది అనాధ పిల్లలకు బట్టలు అందజేసి పండ్లు పంపిణీ చేశారు. తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా అనాధ పిల్లలకు మధ్య ఉగాది వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తల్లి తండ్రి కుటుంబ సభ్యులను కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్న చిన్నారులు వారిని మరచిపోయేందుకు మేమున్నామని భరోసా కనిపించేలా ఉగాది పచ్చడి చేసి వారితో పాటుగా స్వీటు తినిపించి పచ్చడి తాగించి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఒంటరి పిల్లలకు భరోసా కల్పించేందుకే తాము వారి మధ్య తెలుగు నూతన సంవత్సరాది వేడుకలు జరుపుకోవడం జరిగిందని రవీందర్రావు లక్ష్మీ దంపతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పందన అనాధ శరణాలయం నిర్వాహకులు, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు