
పార్లమెంట్ అధ్యక్షుడు జగన్మోహన్ రాజు
అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం జనవరి 18 పయనించే సూర్యుడు ప్రతినిధి… అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని టిడిపి పార్లమెంటు అధ్యక్షుడు చమర్థి జగన్మోహన్ రాజు అన్నారు. శనివారం సుండుపల్లి మండలంలోని దూది మాదిగ పల్లెలో రూ.5 లక్షలతో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా సిసి రోడ్డు పనులను, మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం వీధిలో రూ.7 లక్షలతో సిసి రోడ్డు పనులను ఆయన టెంకాయ కొట్టి ప్రారంభించారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాహకంతో జిల్లాలోని రోడ్లు అద్వానంగా తయారయ్యాయని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సారథ్యంలో రాష్ట్రంతో పాటు అన్నమయ్య జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని అన్నారు. సంక్రాంతి నాటికి దాదాపు అన్ని మండలాల్లో పల్లె పండుగ పనులు ప్రారంభమయ్యాయి అని ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త, అభిమానులు పనిచేస్తున్నారని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్ప, శివరామ్ నాయుడు, ప్రసాద్ రాజు, సురేష్ నాయుడు, జనార్ధన్, మంగిరి సురేష్ బాబు, సర్పంచ్ షరీఫ్, మాజీ ఎంపీటీసీలు బెల్లాల రమణయ్య, సోంపల్లి కిరణ్ కుమార్ నాయుడుమోహన్ బాబు నాయుడు భాజపా మండల అధ్యక్షుడు ఎస్.వి రమణ, భాజపా నాయకులు వెంకటరామరాజు తదితరులు పాల్గొన్నారు.