
ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు మంజూరు
1 కోటి 4950.000 లక్షల కోట్లతో మండల అభివృద్ధికి శ్రీకారం
విలేకరుల సమావేశంలో వెల్లడించిన కాంగ్రెస్ నేతలు
( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 4 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ మెగావత్ నరేందర్ నాయక్ )
నందిగామ మండలం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 13 నెలలోనే ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చొరవతో మండల అభివృద్ధి పనులకు 1 కోటి 4950.000 లక్షల రూపాయలు నిధులు వెచ్చించి పనులు జరగడం పట్ల మండల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం మండల పరిధిలోని నందిగామ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో . నందిగామ మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు. ఉమ్మెంతల అంతయ్య .. నందిగామ మండల కాంగ్రెస్ పార్టీ జంగ నరసింహ.తోపాటు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం పదేళ్లు పరిపాలించిన మండలని అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని ఎద్దవ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు గడుస్తున్న గ్రామాలలో ఉన్న సమస్యలను తీర్చడానికి ప్రభుత్వం కృషి చేసిందన్నారు. గ్రామాలలో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సిసి రోడ్లు, నిర్మాణాల కోసం నిధులను వెచ్చించినట్లు వారు తెలిపారు. రాబోవు నాలుగు సంవత్సరాలలో గ్రామాలలో ఉన్న అన్ని సమస్యలు తీర్చడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఎమ్మెల్యే చెరువుతో మండలానికి భారీగా నిధులు రావడం పట్ల నాయకులు హరీష్ హర్షం వ్యక్తం చేశారు. రాబోవు రోజులలో మండల అభివృద్ధికి నాయకుల అందరం కలిసికట్టుగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మాజీ ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు కొమ్ము కృష్ణ. షాద్ నగర్ మార్కెట్ డైరెక్టర్, చింతలపల్లి నరసింహ, చిన్నంతర గారి మల్లేష్, బొమ్మగల నరసింహ, కేశమౌని రామచంద్ర, శివగల సుమన్, టీ. జంగయ్య, ఎ రమేష్, S. మహేష్, సి. నవీన్, బొమ్మగల, లింగం బొంగుపల్లి సి. బాలరాజు, జాంగారి రాముడు, శివగల అనిల్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.