
అయ్యన్న ఆదివాసీ చట్టాల జోలికి రావొద్దన్న అని భారతకమ్యూనిస్టు పార్టీ(సిపిఐ)మండల కార్యదర్శి కంకిపాటి సత్తిబాబు అన్నారు.విశాఖపట్నంలో ఆంధ్ర్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ షెడ్యూల్ ప్రాంతంలో 1/70 చట్టం సడలిస్తే ఇన్వెస్టర్లు ముందుకు వస్తారని వివాదస్పదమైన వ్యాఖ్యలపై భారత కమ్యూనిస్టు పార్టీ మండల కార్యదర్శి కంకిపాటి సత్తిబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తూ భూబదాలయింపు నిషేధచట్టం సవరిస్తే షెడ్యూల్ ప్రాంతం పూర్తిగా నాశనమౌతుందని,చట్టం ఉన్నప్పుడే అమలు చేయకపోవడంతో ఉల్లంఘన జరుగుతోందని,చట్టమే సవరిస్తే మన్యం అధోగతేనని,భూ బదలాయింపు నిషేధచట్టం 1917లో బ్రిటీషు ప్రభుత్వం హయాంలోనే వచ్చిందని,స్వాతంత్ర్యం అనంతరం 1959లో,1970లలో మరిన్ని సవరణలు చేసి చట్టం కఠిన తరం చేసారు,కానీ అమలు చేయడంలో విఫలమయ్యారని, 5వ షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజనేతరులకు ఎటువంటి హక్కులు లేనప్పటికీ కొంతమంది చట్టాన్ని ఉల్లంఘించి భూములు ఆక్రమించుకోవడం,శాశ్వత భవనాలను నిర్మించుకొన్నారు.ఆదివాసీలకు తమ చట్టాలపై సరైన అవగాహన లేకపోవడంతో వారిని ప్రలోభాలకు గురి చేసి భూములు ఆక్రమించుకొన్నారు.5వ షెడ్యూల్డ్ ప్రాంతంలో ప్రభుత్వం కూడా నాన్ ట్రైబలే అని సమత జడ్జిమెంట్ లో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.ఆదివాసీలు ఈ దేశానికే మూలవాసులని,ఈ ప్రపంచానికి పోరాటం నేర్పింది ఆదివాసీలేనని,తమ భూములు కాపాడుకోవడం కోసమే ఆదివాసీలు పోరాటాలు చేస్తుంటారని,అయ్యన్న పాత్రుడికి ఆదివాసీల స్థితిగతులు బాగా తెలుసునని,ఆదివాసీలను దగ్గర నుండి చూసిన వ్యక్తని,సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు ఆదివాసీ సమాజానికి తీవ్ర ఆగ్రహం తెప్పించాయని,అయ్యన్న నియోజకవర్గంలో కూడా ఆదివాసీల ఓటర్లు ఎక్కువేనని,అయ్యన్న తీరు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో రాజకీయంగా తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు