అశ్వాపురం పంచాయతీ పరిధిలోని కుక్కల బెడద నివారించండి*

September 21, 2026 | తెలంగాణ

*ప్రజావాణి లో వినతిపత్రం అందించిన అశ్వాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ మరియు ఉపసర్పంచ్*

పయనించే సూర్యుడు, సెప్టెంబర్ 21,అశ్వాపురం: అశ్వాపురం గ్రామపంచాయతీ పరిధిలో రోజురోజుకూ పెరుగుతున్న కుక్కల బెడదను వెంటనే నియంత్రించి ప్రజలకు రక్షణ కల్పించాలని కోరుతూ సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో అశ్వాపురం గ్రామ సర్పంచ్ బానోత్ సదర్ లాల్, ఉప సర్పంచ్ తుళ్లూరి ప్రకాశరావు లు ఇంచార్జీ ఏం పి డి ఓ పిచేశ్వర రావు కు వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అశ్వాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని మార్కెట్ ప్రాంతం, స్కూల్ ప్రాంతాలు, ఆసుపత్రులు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామపంచాయతీ కార్యాలయ పరిసరాలు, గౌతమి నగర్ కాలనీతో పాటు గ్రామంలోని అన్ని ప్రాంతాల్లో కుక్కల బెడద తీవ్రంగా పెరిగిందని తెలిపారు.ముఖ్యంగా గౌతమి నగర్ కాలనీలో కుక్కలు ప్రజలపైకి దూసుకెళ్లి కరుస్తున్న పరిస్థితి ఉందని, చిన్నపిల్లలు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, పాదచారులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని పేర్కొన్నారు. కుక్కల దాడుల కారణంగా ప్రజలు గాయపడి ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడు తోందన్నారు. మార్కెట్ ప్రాంతంలో చికెన్, మటన్ షాపులు ఉండటంతో మాంస వ్యర్థాల కారణంగా కుక్కల సంఖ్య మరింత పెరుగుతోందని, ఈ సమస్యపై కూడా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు తెలిపారు.ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం గానీ, సంబంధిత అధికారులు గానీ ఇప్పటివరకు ఈ సమస్యపై తగిన శ్రద్ధ చూపకపోవడం విచారకరమని వారు పేర్కొన్నారు. ఇకనైనా అధికారులు తక్షణమే స్పందించి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని కోరారు.ప్రజావాణిలో సమర్పించిన దరఖాస్తుపై అధికారులు వెంటనే స్పందించి, అశ్వాపురం గ్రామపంచాయతీ ప్రజలకు కుక్కల బెడద నుంచి రక్షణ కల్పించేలా అత్యవసర చర్యలు చేపట్టాలని సర్పంచ్ బానోత్ సదర్ లాల్, ఉప సర్పంచ్ తుల్లూరి ప్రకాశరావు కోరారు.

🌐 Select Language:
📰 ePaper