
డీఎస్పీ హేమలత ఆధ్వర్యంలో ఆదొనిలొ అవగాహన బైక్ ర్యాలి. నిర్వహించిన పోలీసులు
_పయనించే సూర్యుడు, జనవరి 29, కర్నూలు జిల్లా ఇన్చార్జి శ్రీకాంత్
_
ఈరోజు డీఎస్పీ హేమలత ఆధ్వర్యంలో బసవేశ్వర సర్కిల్ నుంచి భీమా సర్కిల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. డీఎస్పీ హేమలత మాట్లాడుతూ వారోత్సవాలు భాగంగా ఈనెల 16వ తేదీ నుండి వచ్చే నెల 15వ తేదీ వరకు వారోత్సవాలు జరుగుతాయి. ఇందులో భాగంగా కర్నూలు జిల్లా ఇన్చార్జి ఎస్పీ ఆదేశాల మేరకు ఆదోని పోలీసులు ప్రజలకు తెలియజేయడమేమనగా
ఆదోనిలోరోజురోజుకుపెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను
దృష్టిలో ఉంచుకుని, ప్రజలకు హెల్మెట్ ధారణ
ప్రాముఖ్యతను తెలియజేసేందుకు పోలీసులు ప్రత్యేకచర్యలు తీసుకున్నారు.
హెల్మెట్ ధరించడం ఎంత ముఖ్యమో ప్రజలకు అవగాహన
కల్పిస్తూ, “హెల్మెట్ ధరించండి – మీ ప్రాణాలను
రక్షించుకోండి” అనే సందేశాన్ని పోలీసులు అందించారు. అలాగే డ్రైవింగ్ లైసెన్సు ఇన్సూరెన్స్ కంపల్సరిగా ఉండాలి ఫోర్ వీలర్ డ్రైవింగ్ చేసేవాళ్లు సీట్ బెల్ట్ కంపల్సరిగా ధరించాలి. అని తెలిపారు.