
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 3 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
తెలుగు వారి సంస్కృతిలో కూచిపూడి నృత్యానికి అత్యంత ప్రజాదరణ ఉందని, అంతరించిపోతున్న ఈ నృత్యకళను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగువారిపై ఉందని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, సరస్వతీ ఉపాసకులు దైవజ్ఞ శర్మ అన్నారు. నగరంలోని బిర్లా భాస్కర్ ఆడిటోరియంలో మేరా భారత్ మహాన్, నాలుగవ సీజన్ లో భాగంగా హైదర్ నగర్ డివిజన్ ఆదిత్య నగర్ లోని రుహని కూచిపూడి డ్యాన్స్ అకాడమీ నిర్వాహకులు నేరెళ్ల కల్పన ఆధ్వర్యంలో నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శనకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుహాని కూచిపూడి నృత్య అకాడమీ లోని చిన్నారులందరు తమ అద్భుతమైన నృత్య ప్రదర్శన ప్రదర్శించారని కొనియాడారు. చిన్నారులు చేసిన నాట్య ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిందనడంలో సందేహం లేదన్నారు. చిన్న వయసులోనే ఆ చిన్నారులు చేసిన ప్రదర్శన ఆకట్టుకోవడంతో పాటు కూచిపూడి నృత్యాన్ని భావితరాలకు అందించడానికి తమ వంతు కృషి చేయాలనే సంకల్పం కలుగుతుందనడంలో సందేహమే లేదన్నారు. చిన్న వయసులోనే అద్భుతమైన ప్రతిభ కనబరిచిన చిన్నారులను ఆయన ఆశీర్వదించారు. తెలుగు కళలను భావితరాలకు అందించడానికి కృషి చేస్తున్న చిన్నారుల తల్లిదండ్రులను ఆయన అభినందించారు. ఈ కూచిపూడి నృత్య ప్రదర్శనలో బిందు మాధవి భావన, నీలా, లిఖిత, రిధి అనే చిన్నారులు తమ కూచిపూడి నృత్య ప్రదర్శనను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో నిర్వాకులు సిరాజ్ తదితరులు పాల్గొన్నారు