జీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి.
పయనించే సూర్యుడు: జనవరి 17: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి. రామ్మూర్తి.ఎ… వాజేడు: ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం లోనీ ఆర్ అండ్ బి విశ్రాంతిభవన్లో గురువారం మీడియా సమావేశంలో జీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి మాట్లాడుతూ ఆదివాసి న్యాయ కళాశాల కోసం ఉద్యమిస్తామని,త్వరలో గొండ్వానా సంక్షేమ పరిషత్ నాయకులు కార్యకర్తలు దండయాత్రకి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.గురువారం నాడు వెంకటాపురం ఆర్ ఎం బి గెస్ట్ హౌస్ ఆవరణంలో జి.ఎస్.పి ములుగు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం ప్రతాప్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి దొర మాట్లాడుతూ. 5వ షెడ్యూల్ భూభాగంలోని భద్రాచలం కేంద్రంగా ఆదివాసి న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒరిస్సా, చతిస్గడ్, భద్రాచలం కేంద్రంగా న్యాయ కళాశాల ఏర్పాటు చేస్తే ఆంధ్రప్రదేశ్,తెలంగాణ ఆదివాసి యువతీ యువకుల ఆదివాసి చట్టాలపై అవగాహన ఉంటుందని ఆయన అన్నారు.ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ ఆదివాసి జీవితాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడ లాగే మిగిలి ఉన్నాయని, ఆదివాసి బ్రతుకులు ఏమాత్రం మారలేదని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తు చేశారు. ఆదివాసీల కోసం ఐటిడిఏ ఉన్నప్పటికీ ఆదివాసి విద్య,ఉద్యోగ అవకాశాలు వైపు తీసుకుపోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ఆరోపించారు.ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసిలు పడుతున్న సమస్యలు నియోజకవర్గ ఆదివాసీ ఎమ్మెల్యేలకు ఫిర్యాదులు చేసినప్పటికీ వారు చట్టసభలో ప్రస్తావించకపోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ఏజెన్సీ చట్టాలపై ఏమాత్రం గౌరవం ఉన్న 1/70 పేసా చట్టాలను పూర్తిస్థాయిలో అమలు చేసే దిశగా ప్రభుత్వాన్ని ఆదివాసి ఎమ్మెల్యేలు డిమాండ్ చేయాలని కోరారు.అలాగే భద్రాచలం కేంద్రంగా ఆదివాసీ న్యాయ కళాశాల ఏర్పాటుకై అసెంబ్లీలో ప్రస్తావించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆదివాసి సమాజం ఆదివాసీ ఎమ్మెల్యేలను ద్రోహులుగా చూస్తుందని పూనెం సాయి అన్నారు. త్వరలో గొండ్వానా సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో న్యాయ కళాశాలకై ఉద్యమిస్తామని త్వరలో తేదీని కూడా ఖరారు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కారం ఆనంద్,శంకర్ పాల్గొన్నారు