
పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జి అక్టోబర్ 7
కోట రామచంద్రపురం ఐటిడి పరిధిలోని ఆదివాసి గ్రామాలలో పర్యటనలో భాగంగా ఢిల్లీ నుంచి విచ్చేసిన జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ సభ్యులు శ్రీ జాటోత్ హుస్సేన్ నాయక్ వారిని సోమవారం కలిసి ఆదివాసి చట్టాలు అమలు చేయాలని, రెడ్డిగూడెం గ్రామ ఆదివాసులకు పోడు వ్యవసాయం చేయుటకు అవకాశం కల్పించాలని. రెడ్డిగూడెం గ్రామస్తులు సాగు చేసుకుంటున్నా భూమి ని ప్రభుత్వ అధికారులు, ఫారెస్ట్, పోలీస్ అధికారులు బలవంతంగా దౌర్జన్యం చేసి లాక్కున్నారని ఫిర్యాదు చేయటం తోటి స్పందించిన జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ మెంబెర్ జాటోత్ హుస్సేన్ నాయక్, మంగళవారం నాడు ఉదయం బుటాయిగూడెం మండలం రెడ్డిగూడెం గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా కమిషన్ సభ్యులు రెడ్డిగూడెం గ్రామస్తులు గతంలో సాగు చేసుకుంటూ ఉన్న పోడు భూములను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కమిషన్ సభ్యులతో రెడ్డిగూడెం ఆదివాసులు మాట్లాడుతూ సుమారు 1980 సంవత్సరం నుండి మా పెద్దల కాలం నుండి ఇక్కడ పోడు భూములు వ్యవసాయం చేసుకుంటున్నామని మాకున్న కొద్ది గొప్ప భూములు కొవ్వాడ రిజర్వాయర్లో మునిగిపోయాయని ప్రస్తుతానికి మాకు ఈ పోడు భూములే జీవనాధారం అని, అటువంటి మా జీవన ఆధారమైనటువంటి పోడు భూములను ఐటీడీఏ అధికారులు ఫారెస్ట్ అధికారులు పోలీసు అధికారులు కలిసి మాపై దౌర్జన్యం చేసి మా సాగు భూముల నుండి మమ్మల్ని గెంటివేసారాని అంతేకాక మాపై కేసులు పెట్టి జైల్లో కూడా పెట్టించారని ఆవేదన వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ ఆదివాసులకు సాగు చేస్తున్నటువంటి భూములను బలవంతంగా లాక్కొని జీడి మామిడి తోటలను పంటసేలను నరికి వేయటం ధ్వంసం చేయటం బాధాకరమైన విషయమని. అమాయక ఆదివాసులపై ఇటువంటి చర్యల ని జాతీయ షెడ్యూల్ కమిషన్ తీవ్రంగా పరిగణిస్తుందని అధికారులను హెచ్చరించడం జరిగింది. అలాగే రెడ్డిగూడెం ఆదివాసులకు మీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం భూములు లేక ఆదివాసులు కూలి పని చేసుకుని బతుకుతున్నారని ఆదివాసులకి న్యాయం చేస్తానని జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ సభ్యులు హామీ ఇచ్చినందుకు వారికి ఆదివాసీలు ఆదివాసి సంక్షేమ పరిషత్ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం జరిగిన ఆదివాసీల సమావేశంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ సభ్యులు మాట్లాడుతూ ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆదివాసులకు న్యాయం జరిగే వరకూ ఆదివాసి సంక్షేమ పరిషత్ అండగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు కాకి మధు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను, రాష్ట్ర ఉపాధ్యక్షులు వంతల నాగేశ్వరరావు, తెల్లం లక్ష్మణ్ రావు పూసం శ్రీను రవ్వ బసవరాజు. కేరం వెంకటేశ్వరరావు, కోపల లచ్చిరెడ్డి, వేట్ల పెంటమ్మ, దుర్గమ్మ, పట్ల రమేష్ రెడ్డి. దుర్గారెడ్డి, నాగిరెడ్డి రెడ్డిగూడెం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

