Friday, January 31, 2025
HomeUncategorizedఆదివాసి సంక్షేమ పరిషత్

ఆదివాసి సంక్షేమ పరిషత్

Listen to this article

పయనించే సూర్యడు సిహెచ్.విద్యాసాగర్
జనవరి:-30

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ పదవి ఉన్నతమైనది భారత రాజ్యాంగ విలువలను కాపాడుకోవాలి:
ఆదివాసి సంక్షేమ పరిషత్ 3898/90

అల్లూరి సీతారాముల జిల్లా రంపచోడవరం డివిజన్ పరిధిలో ఎటపాక మండలం యందు పిచ్చుకలపాడు గ్రామం పంచాయతీ చెన్నంపేట గ్రామంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ ముఖ్య కార్యకర్తలు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ఆ సంఘ ప్రధాన కార్యదర్శి బానిస వెంకటేశ్వర్లు మాట్లాడుతూ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పీకర్ మైదాన షెడ్యూల్ ప్రాంతాలకు తేడా తెలియకుండా మాట్లాడుతున్నారని భారత రాజ్యాంగం మైదాన ప్రాంతంలో ప్రజలకు వారి యొక్క భాష సంస్కృతి సాంప్రదాయం అలవాట్లు ఆచారాలు కలలు విశ్వాసాలు నమ్మకాలు అభివృద్ధి చెందిన సమాజాలుగా కాంప్లెక్స్ సొసైటీస్ గుర్తించడం జరిగిందని. ఐదో షెడ్యూల్ ప్రాంత ంలోని భారత రాజ్యాంగం షెడ్యూల్ తెగల ఆదివాసి ప్రజల యొక్క భాషా సంస్కృతి సాంప్రదాయాలలో ఆచారాలు అలవాట్లు నమ్మకాలు కలలు భిన్నంగా ఉండడం వలన భారత రాజ్యాంగ లో ఐదో షెడ్యూల్ ప్రాంతాల అభివృద్ధి కొరకు 1/70 చట్టం పీసా, అనేక చట్టాలు జీవో ఏర్పాటు చేయడం జరిగింది అని ఇక్కడి ఆదివాసి ప్రజల అభివృద్ధిని విస్మరించి. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులు వలసిన ప్రోత్సహించి వారి అభివృద్ధిని, అభివృద్ధి చెందిన వ్యాపారవేత్త శక్తుల అభివృద్ధి కొరకు
1/70 చట్టం, పర్యాటక రంగ అభివృద్ధికి అడ్డు అని చెప్పడం విడ్డూరంగా ఉంది కావున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ స్పీకర్ గారు మాట్లాడిన మాటలను వెనకాలకు తీసుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ప్రాంతాల్లోనూ ఆదివాసి ప్రజలను గౌరవించేందుకు జోహార్ లాల్ నెహ్రూ పంచశీల సూత్రాలను పాటిస్తే బాగుంటుందని అన్నారు. పర్యాటక అభివృద్ధి గురించి అమెరికా దేశాన్ని చూసుకొని నేర్చుకోవాలని, వారు ఆ దేశంలో ప్రజల గురించి భవిష్యత్ తరాల గురించి ఆదేశ ఆలోచన విధానమే గొప్పదనం పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ప్రాంతాల్లో ని తెగల సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడడం మరిచిపోయి కనీసం పర్యాటక ఉత్సవాలలో ఆదిమ తెగలు కలుపుకొని పోవడం అన్నారు .

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి వద్ద ఎర్రవరం మన్యం జిల్లా సాలూరు అనకాపల్లి జిల్లా చింతలపూడి వద్ద హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ప్రాజెక్ట్, ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం వంకాయల వారి పాలెం వద్ద ఆయుధ కర్మాగారం నిర్మాణం 1/70 చట్టాలను ఉల్లంఘించి వేల ఎకరాలము భూములను అడవులను ప్రైవేట్ వ్యక్తులకు కార్పొరేటెడ్ శక్తులకు ప్రభుత్వాలు ఇవ్వడం ద్వారా ఆదివాసులను భూమికి దూరం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కంగాల వెంకటేశ్వర్లు మడివి రాజు వెంకటేష్ పూనెం నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments