
బిజెపి పట్టణ సెంట్రల్ అధ్యక్షులు తోవి నాగార్జున
_పయనించే సూర్యుడు, ఫిబ్రవరి 3, ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ
_
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పార్థసారధి సూచన మేరకు ఆదోని అసెంబ్లీ కన్వీనర్ శ్రీరాములు, కోకన్వినర్ నాగరాజ్ గౌడ్ సహకారంతో ఆదోని పర్వతాపురంలో నిన్నటి రోజున పార్టీ సంస్థాగత విషయమై ఆ వార్డుకు వెళ్లడం జరిగిందని, తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు మా దగ్గరకు అక్కడ నెలకొన్న సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. గతంలో కూడా అధికారులు ఆ వార్డులో సమస్యలను తెలుసుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఏమి చేయలేదని చెప్పడం జరిగింది.మంచినీటికి సంబంధించిన పైప్ లైన్ పగిలి పోయి నీరు వృధాగా పోతున్నదని నీటి కొళాయిలు కూడా ఒక సమయం కేటాయించి సరైన సమయానికి నీరు వదలాలని కాలువల మీద కూడా కల్వర్టులు ఏర్పాటు చేయాలనీ, విద్యుత్ దీపాలు అలాగే నీటి ట్యాంక్ చుట్టూ కట్టవలసిన ప్రహరీ గోడ నిర్మించాలని కోరడం జరిగింది.. కావున ఈ సమస్యలను తొందరగా పరిష్కరించాలని ఆదోని మునిసిపల్ కమిషనర్ ఎం కృష్ణ సమస్యల పరిష్కారానికై వినతి పత్రం ఇవ్వడం జరిగింది..ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పగడాల కిరణ్ బీజేవైఎం నాయకులు వినోద్ కుమార్ పర్వతపురం కార్యకర్తలు పాల్గొన్నారు..