
పయనించే సూర్యుడు”ఫిబ్రవరి 15_కర్నూలు జిల్లా ఇన్చార్జి శ్రీకాంత్ : ఈరోజు కర్నూలు జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు “ఆదోని డీఎస్పీ ఆధ్వర్యంలో “జాతీయ రహదారి భద్రత మహోత్సవాలు” – 20 25 చివరి రోజు సందర్భంగా ఆదోని సబ్ డివిజన్ పోలీసు సిబ్బంది, మరియు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శశిర దీప్తి మరియు వాళ్ళ సిబ్బంది టూ టౌన్ నుండి గవర్నమెంట్ హాస్పిటల్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్, పిసిఆర్ సర్కిల్ వరకు వెళ్లి తిరిగి 2 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు అందరూ కూడా హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ నిర్వహించడమైనది దీనిలో భాగంగా ట్రాఫిక్ సిఐ, 1 టౌన్, రూరల్ సిఐలు, ఎస్సైలు, ఆదోని సబ్ డివిజన్ సిబ్బంది అందరూ ర్యాలీలో పాల్గొన్నారు.ఆదోని డీఎస్పీ మర్రిపాటి హేమలత మాట్లాడుతూ ఈ జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలు యొక్క ముఖ్య ఉద్దేశ్యము, ఈ ప్రపంచంలో అన్నిటికంటే అతి విలువైనది మన ప్రాణము అని, ఆ ప్రాణాన్ని మనము కాపాడుకోవడానికి తప్పనిసరిగా టు వీలర్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని, ఫోర్ వీలర్స్ నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, సెల్ ఫోన్ మాట్లాడుతూ మరియు మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదని మరియు వేగం కన్నా ప్రాణం మిన్న అని వాహనాలు నడిపేటప్పుడు ఇంటిదగ్గర మన కుటుంబం మన కోసం ఎదురు చూస్తుంటారని, వాళ్లకు మనమే ఆధారం అని గుర్తించుకొని, ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించి ప్రమాదాలు జరగకుండా కాపాడుకోవడం మనందరి ప్రథమ కర్తవ్యం అని తెలపటమైనది.