
పయనించే సూర్యుడు జిల్లా ఇన్చార్జ్ శ్రీకాంత్ (18: జనవరి) (ఆదోని నియోజకవర్గం ) ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి హయాంలో జరుగుతున్న భూకబ్జాలు మరియు అవినీతి ఆరోపణలపై విచారణ చేయించాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ కి లేఖలు రాయడం జరిగింది. పార్థసారథి పాలనలో జరుగుతున్న వరుస భూకబ్జాలు అవినీతి ఆరోపణలతో కూటమి ప్రభుత్వానికి తలవంపులుగా మారింది.అదేవిధంగా ప్రజలకు రియల్ ఎస్టేట్ రంగము మరియు అనుసంధాన రంగాలు, వ్యాపారాలు దెబ్బ తినడంతో వ్యాపార మరియు ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయి. అంతిమంగ ఈ పరిణామాలు ఆదోనిలో ప్రజల జీవన ప్రమాణాన్ని దెబ్బతీస్తున్నాయి.
ఇక రెండవ లేఖలో గత వైసిపి ప్రభుత్వం లో మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి అరాచకాలు, భూకబ్జాల ఆరోపణలపై ప్రత్యేక విచారణ బృందం(సిట్) ఏర్పాటు చేయాలని ఫిర్యాదు చేయడం జరిగింది. సిట్ ఏర్పాటు చేస్తే బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది తద్వారా బాధితులకు టిడిపి కూటమి ఆధ్వర్యంలో న్యాయం జరిగే అవకాశం ఉంది. సిట్ ఏర్పాటు ఆదోని ప్రజల చిరకాల వాంఛ అని లేఖలో తెలియజేయడం జరిగింది.ఆదోనిలో నీతి,నిజాయితీ గల పాలన ఏర్పాటు చేసి అవినీతిపరులను శిక్షించడం ద్వారా ఆదోని ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి,విద్యాశాఖ మంత్రి లోకేష్ కి లేఖలలో విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆదోనిలో చంద్రబాబు మార్పు పాలనతో ఆదోని ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఎం హెచ్ పి ఎస్ ఆశిస్తుంది. కూటమి ప్రభుత్వము దిగ్విజంగా సాగి సాగేందుకు ఎం.హెచ్.పి.సమితి తనవంతు కృషి చేస్తుందని మనవి చేసుకుంటున్నాము.
ఎ. నూర్ అహ్మద్, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి.