రుద్రూర్, జనవరి 30 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మండల బీఆర్ ఎస్ పార్టీ ఇంచార్జ్ గాండ్ల మధు అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద బీఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు గాంధీ విగ్రహానికి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్బంగా గాండ్ల మధు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు 420 రోజులు గడుస్తుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీ పథకాల పై ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం అయ్యారన్నారు. కాంగ్రెస్ పాలన ప్రజలకు నచ్చడం లేదని, ప్రజా పాలన చేతకాకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్. పోచయ్య, నీరడి సాయిలు,కొండల్ వాడి సాయికిరణ్, చాంద్ పాషా,షాదుల్ తదితరులు పాల్గొన్నారు.
ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం..
RELATED ARTICLES