
పయనించే సూర్యడు సిహెచ్.విద్యాసాగర్
దేవీపట్నం మండలం
ఫిబ్రవరి:-04
తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం విశ్వహిందూ ధర్మ రక్షణ రామసేన అధ్యక్షులు మరియు భారతీయ జనతా పార్టీ నాయకుడు కంబాల శ్రీనివాస్ అచ్చుతాపురం గ్రామానికి చెందిన యోగుపాటి రాజుకి బ్రెయిన్ స్ట్రోక్ వల్ల కాలు చేయి పడిపోవడంతో పనికి వెళ్తే గాని పూటగడవని పరిస్థితి యోగుపాటి రాజు అలాంటి పరిస్థితి లో నేనున్నానంటూ ముందుకు వచ్చి కంబాల శ్రీనివాస్ అతనికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం కాకుండా ఇరవైఐదు కేజీలు బియ్యం ఇస్తూ ఇక నుండి మీ వైద్యానికి అయ్యే ఖర్చులు నేనే భరిస్తానంటూ. అలానే నెల నెలకు ఇరవైఐదు కేజిలు బియ్యం ఇస్తానంటూ ఆ కుటుంబానికి కంబాల శ్రీనివాస్ భరోసా ఇవ్వడం జరిగింది.అంతేకాకుండా చింతల మల్లికార్జున వాళ్ళ అమ్మగారికి కూడా హార్ట్ సర్జరీ నిమిత్తం పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తూ వైద్య ఖర్చులన్నీ భరిస్తానంటూ హామీ ఇవ్వడం జరిగింది. నిరుపేదలకు దళితులకు ఏ అవసరం వచ్చినా నేను మీ ముందు రామ దూతగా ఉంటానని కంబాల శ్రీనివాస్ అన్నారు.
ఈ కార్యక్రమంలో వరసల ప్రసాద్,ఇనకొటి బాపన్న దొర ప్రజలు పాల్గొన్నారు లో.